జాతీయస్థాయి ఫుట్ బాల్ పోటీలకు కర్నూలు జిల్లా క్రీడాకారుడు

జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు కర్నూలు జిల్లా క్రీడాకారుడు
కర్నూలు క్రీడలు అక్టోబర్ 21 యువతరం న్యూస్:
ఆగస్టు నెలలో జరిగిన జోనల్ ఫుట్బాల్ పోటీల్లో చక్కటి ప్రతిపని ఘనపరిచి ఎల్. నరసింహ ఈనెల 26వ తారీకు నుంచి 30వ తారీకు వరకు జార్ఖండ్ రాష్ట్రంలో జరగబోయే జాతీయస్థాయి సబ్ జూనియర్ ఫుట్బాల్ పోటీలకు ఎంపిక కావడం జరిగింది. ఈ మేరకు కర్నూల్ డిస్టిక్ ఫుట్బాల్ ప్రెసిడెంట్ ముప్పరాజ్ శేఖర్ మాట్లాడుతూ మన కర్నూలు జిల్లాకు చెందిన క్రీడాకారుడు జాతీయ స్థాయికి ఎంపిక కావడం చాలా గర్వించదగ్గ విషయమని ఆయన తెలియజేశారు అదే విధంగా కర్నూల్ డిస్టిక్ ఫుట్బాల్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో కూడా చక్కటి ప్రతి పని కనబరచాలని ఆయన ఆకాంక్షించారు, కర్నూల్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ సెక్రెటరీ వై. శ్రీనివాసులు మాట్లాడుతూ మన కర్నూలు జిల్లా క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా జాయింట్ సెక్రెటరీ నారాయణ మరియు కోచ్ బ్రహ్మకుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు.