కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది_బిజెపి పార్టీ ఫుల్ అవుతుంది

కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది_బిజెపి పార్టీ ఫుల్ అవుతుంది
కర్నూలు క్రీడలు అక్టోబర్ 21 యువతరం న్యూస్:
ఒకరి తర్వాత ఒకరిని ఏదో సాకుతో నాయకులను బయటకు నెట్టేస్తున్నారు,
మాజీ జిల్లా అధ్యక్షునికి నోటీస్ ఇవ్వడమా, కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షులు బాబురావుకు వివరణ ఇవ్వాలని నోటీసు ఇవ్వడం బాధాకరమని కాంగ్రెస్ నేత మాజీ మంత్రి మూలింటి మారెప్ప ఆవేదన వ్యక్తం పరిచారు. మంగళవారం తన చాంబర్లో విలేకరులతో మాజీ మంత్రి మూలింటి మారెప్ప మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్యకాలం ఏదో సాకుతో కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించడం, తొలగి పోయిన వారంతా బిజెపిలో చేరడం చూస్తే, కొందరు ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపడం వారు బిజెపిలో చేరడం చూస్తే కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం, బిజెపి పార్టీని బలపరచడం వంటి సందర్భాలు కనిపిస్తున్నాయని మారెప్ప తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో మాలలను మాదిగలతో పాటు అన్ని కులాల వారికి సముచిత న్యాయం కలిగించాలని, కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలని మారెప్ప కోరారు.