ANDHRA PRADESHDEVELOPWORLD

ప్రధానమంత్రి నరేంద్ర మోది కి ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం

ప్రధానమంత్రి నరేంద్ర మోది కి ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ఆత్మీయ స్వాగతం

కర్నూలు రూరల్ అక్టోబర్ 16 యువతరం న్యూస్:

ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కర్నూలు ఎయిర్పోర్ట్ కి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ప్రజా ప్రతినిధులు ఆత్మీయ స్వాగతం పలికారు.
కర్నూలు ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, భూపతి రాజు శ్రీనివాస్ శర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి వి ఎన్ మాధవ్, కర్నూలు జిల్లా ఇంచార్జి మంత్రి మరియు జలవనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ మంత్రి ఎన్ఎండి.ఫరూక్,రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బిసి.జనార్ధన్ రెడ్డి, చీఫ్ సెక్రెటరీ విజయానంద్, డిజిపి హరీష్ కుమార్ గుప్తా, ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, డోన్ ఎమ్మెల్యే జయసూర్యప్రకాష్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, ఆలూరు ఎంఎల్ఏ విరూపాక్షి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మధుసూదన్, మయానా జాకియా ఖానం, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నాయకులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, బాపురం రామకృష్ణ, మధుసూదన్ రెడ్డి, చింతా సురేష్ తదితరులు స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా కర్నూలు ఎయిర్ పోర్టు నుండి హెలికాప్టర్ లో సున్నిపెంట హెలిప్యాడ్ కి వెళ్ళి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని అనంతరం సున్నిపెంట హెలిప్యాడ్ నుండి రాగమయూరి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు వచ్చి అనంతరం సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని ముగించుకొని సా.4.50 గం.లకు కర్నూలు ఎయిర్ పోర్ట్ నుండి ఢిల్లీ కి బయలుదేరి వెళ్లారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!