శబరి నీకు నా ఆశీస్సులు అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని పొగడ్తలతో ముంచిన ప్రధాని మోడీ

శబరి నీకు నా ఆశీస్సులు అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
శబరి వల్లే నేను ఈ రోజు శ్రీశైలం వచ్చానన్న ప్రధాని మోడీ
ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని పొగడ్తలతో ముంచిన ప్రధాని మోడీ
కర్నూల్ రూరల్ అక్టోబర్ 16 యువతరం న్యూస్:
శ్రీశైలం పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ఉదయం 10.15 గంటలకు నంద్యాల జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం కు చేరుకున్నారు. ఓర్వకల్లు విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ నజీర్ అహమ్మద్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, రాష్ట్ర మంత్రులు, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తదితరులు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన మంత్రికి మంత్రులు, ఎంపీ లను పరిచయం చేస్తూ నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీ సీఎం పరిచయం చేస్తుండగా వెంటనే స్పందించిన ప్రధాని మోడీ శబరి వల్లే ఈ రోజు నేను శ్రీశైలం వచ్చాను. పార్లమెంట్ లో పలుమార్లు సార్ శ్రీశైలం రండి, శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను దర్శనం చేసుకువాలనీ పిలిచారని అనగానే ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మోడీ జీ మీరు ఎలా ఉన్నారు? సీఎం చంద్రబాబు ఆమె మన నంద్యాల ఎంపీ డాక్టర్ శబరి అనగానే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెంటనే స్పందించి అవును నాకు తెలుసు, ఆమె నన్ను చాలాసార్లు శ్రీశైలానికి రమ్మని పిలుచుకు వచ్చింది. శబరి వల్లే ఈ రోజు నేను శ్రీశైలం వచ్చాను. శబరి మీకు నా ఆశీస్సులు అని ప్రధాన మంత్రి అనగానే అక్కడ ఉన్న మంత్రులు, అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యంకు గురైయ్యారు. ప్రధాన మంత్రి అందరి ముందు పొగడడంతో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆనందంకు అవదులులేవు.