తండ్రి బైరెడ్డి కోరిక నెరవేరుస్తున్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోడీనీ కర్నూలు రప్పించి రాయలసీమ కరువు కష్టాలు చెప్పాలన్న బైరెడ్డి కోరిక
తండ్రి బైరెడ్డి కోరిక నెరవేరుస్తున్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
భారత ప్రధాన మంత్రి హోదాలో నరేంద్రమోడీనీ కర్నూలుకు రప్పించి రాయలసీమ కరువు కష్టాలు విన్నవించాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రధాన కోరిక
కర్నూలు టౌన్ అక్టోబర్ 16 యువతరం న్యూస్:
రెండున్నర ఏళ్ల క్రితం బైరెడ్డి రాజశేఖరరెడ్డి భారతీయ జనతా పార్టీలో ఉంటూ కూతురు డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షురాలుగా ఉండేవారు.
కర్నూలు కన్వెంక్షన్ హల్ లో రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రాయలసీమ 8 జిల్లాల నుంచి రాయలసీమ ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొనీ రాయలసీమకు నీళ్లు, నిధులు, నియమకాలు, రాష్ట్ర బడ్జెట్ లో జనాభా ప్రాతిపధికనా రాయలసీమకు రావాల్చిన నిధులు విడుదల చేయాలని, 2004 రాష్ట్ర విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం వెనుకబడ్డ జిల్లాల కోసం ఖుందేల్ తరహా రూ. 50 వేల కోట్ల ప్రత్యేక ఫ్యాకేజ్ నిధులు కేంద్రం విడుదల చేసి అన్ని రంగాల్లో వెనుకబడ్డ రాయలసీమను అభివృద్ధి చేయాలని, కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేసిన తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల, జమ్మలమడుగు వరకు 167K జాతీయ రహదారి నిర్మాణం లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సిద్దేశ్వరం వద్ద రూ. 1200 కోట్లతో కృష్ణానదిపై ఐ కానిక్ బ్రిడ్జి ( తీగల వంతెన) మంజూరు చేసింది. ఈ తీగల వంతెన వల్ల రాయలసీమ కరువు కు పరిష్కారం ఉండదని, ఐ కానిక్ బ్రిడ్జి స్థానంలో (తీగల వంతెన బదులు) బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణం చేస్తే సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో సుమారు 60 టీఎంసీ నీరు నిలిచి రాయలసీమ ప్రాజెక్టులకు అంది తాగునీరు, సాగునీరు అందుతుందని, శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ బ్రిడ్జి కం బ్యారేజ్ రక్షణగా ఉంటుందనీ, తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ లోని 8 జిల్లాల్లో శాశ్వత కరువు నివారణకు ఉపయోగపడుతుందనీ,
ఇది సాధ్యం కావాలంటే దేశాభివృద్ధికి అంకితమై పనిచేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తోనే సాధ్యమని, తాను, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డిలం బీజేపీ రాష్ట్ర కమిటీలో ఉన్నాం, బీజేపీ కేంద్రకమిటీ దృష్టికి తీసుకెళ్లి కర్నూలులో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించి మన రాయలసీమ కష్టాలు మోడీకే విన్నవించుకుందాం అని రాయలసీమ స్టీరింగ్ కమిటీ అధ్యక్షులుగా రాయలసీమ ఉద్యమకారుల విసృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రశంగించారు. అయితే సాధారణ ఎన్నికలు రావడం, టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించడం, బైరెడ్డి కూతురు డాక్టర్ బైరెడ్డి శబరికి నంద్యాల టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం, భారీ మెజారిటీతో టీడీపీ ఎంపీగా డాక్టర్ బైరెడ్డి శబరి విజయం సాధించడం విధితమే. ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, ఆమె భర్త డాక్టర్. శివ చరణ్ రెడ్డిలు ప్రధానమంత్రి నరేంద్రమోడీనీ మర్యాదపూర్వకంగా కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రం భూ కైలాసంగా విరాజీళుతున్న శ్రీశైలం వచ్చి శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను దర్శనం చేసుకువాలని ఆహ్వానించారు. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దంపతుల ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి శ్రీశైలం పర్యటన ఈ నెల 16 వ తేదీ ఖరారు అయింది. దీంతో రాజకీయ అపర చాణుక్యుడు, సుధీర్గ పరిపాలన అనుభవం కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనను రాష్ట్రాభివృద్ధికి ఉపయోగుంచుకునేందుకు ప్రణాళికవేసి శ్రీశైలం దర్శనం అనంతరం కర్నూలులో భారీ బహిరంగసభ ప్రధానమంత్రి కోసం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి కోరికలు నేడు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ నోట హామీతో నెరవేరుతాయని ఆశీద్దాం.