ANDHRA PRADESHEDUCATIONOFFICIALSTATE NEWS

ఎం జె పి పాఠశాల సిబ్బందిపై మంత్రి సవిత ఆగ్రహం

ఎం జె పి పాఠశాల ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సవిత

ఎం జె పి పాఠశాల ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సవిత

పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

విద్యార్థినిలకు ఉన్నత స్థాయి చదువులు ప్రభుత్వ లక్ష్యం

వెల్దుర్తి అక్టోబర్ 16 యువతరం న్యూస్:

బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, జౌళి మరియు వస్త్ర పరిశ్రమ శాఖ మంత్రి సంజీవరెడ్డి గారి సవిత గురువారం సాయంత్రం కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తి లోని ఎం జె పి పాఠశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. పాఠశాలలో ప్రిన్సిపల్ మరియు వార్డెన్, రికార్డులు సరిగా లేకపోవడంతో ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. పాఠశాలలోని స్టోర్ రూమును తనిఖీ నిర్వహించారు. పాఠశాలలోని కొన్ని వస్తువులలో నాణ్యత కొరబడిందని, తప్పకుండా పాటించాలన్నారు. కోడిగుడ్డును బరువు చూడగా 40 గ్రాములు ఉండడం గమనార్హం. కోడిగుడ్డు సైజు మరియు బరువు తక్కువగా ఉందని మంత్రి ఆగ్రహం వెలిబుచ్చారు. అదేవిధంగా విద్యార్థినిలతో ముచ్చటించారు. విద్యార్థినిలు గతంలో కన్నా నేడు అన్ని విధాల పాఠశాలలో నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ చదువుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో విద్యను విద్యార్థినిలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. నాణ్యమైన సన్నబియ్యంతో విద్యార్థినిలకు, విద్యార్థులకు ఆహారం అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి అభినందనీయమన్నారు. విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా తెదేపా సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు, మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!