అక్టోబర్ 16 న కర్నూలు లో ప్రధానమంత్రి పర్యటన_ వాహనాలకు ట్రాఫిక్ మళ్ళింపు

అక్టోబర్ 16 న కర్నూలు లో ప్రధానమంత్రి పర్యటన_
వాహనాలకు ట్రాఫిక్ మళ్ళింపు
కర్నూలు జిల్లా ప్రజలు సహకరించాలి
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
కర్నూలు క్రైమ్ అక్టోబర్ 15 యువతరం న్యూస్:
అక్టోబర్ 16 వ తేది న భారత ప్రధానమంత్రి కర్నూలుకు విచ్చేస్తున్న సందర్భంగా ఉదయం నుండి సాయంత్రం వరకు కర్నూలు మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసిన వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపు ఈ క్రింద విధంగా ఉంటుంది.
కడప నుండి కర్నూలు మీదుగా హైదరాబాదు వైపుకు వెళ్లే వాహనాలు.
పాణ్యం, గడివేముల, మిడ్తూరు, బ్రాహ్మణ కొట్కూరు, కోల్లబాపురం, పూడూరు, అలంపూర్ బ్రిడ్జి, అలంపూర్ చౌరస్తా నుండి హైదరాబాదు వైపు వెళుతాయన్నారు.
కడప నుండి కర్నూలు వైపు వెళ్ళే వాహనాలు.
పాణ్యం, మిడ్తూరు, నందికొట్కూరు, కోల్లబాపురం, పూడూరు, అలంపూర్ బ్రిడ్జి, అలంపూర్ చౌరస్తా నుండి కర్నూలు కు చేరుకుంటాయన్నారు.
నంద్యాల నుండి బెంగళూరు వైపు వెళ్ళే వాహనాలు.
పాణ్యం, బనగానపల్లె, ఎన్.రాచర్ల, డోన్, బెంగళూరు
పాణ్యం, తమ్మరాజుపల్లె, బేతంచెర్ల, డోన్, బెంగళూరు
సోమయాజుల పల్లె, బేతంచెర్ల, డోన్, బెంగళూరు
శ్రీశైలం నుండి కర్నూలు రోడ్డు
ఆత్మకూరు నుండి అనంతపురం వైపు వెళ్ళు వాహనాలు ఆత్మకూరు – బండి ఆత్మకూరు, పాణ్యం, బనగానపల్లె, ఎన్.రాచర్ల, డోన్, అనంతపురం మీదుగా వెళతాయి.
ఆత్మకూరు నుండి బళ్ళారి వైపు వెళ్ళు వాహనాలు
ఆత్మకూరు – బ్రాహ్మణకొట్కూరు, కోల్లబాపురం, పూడూరు, ఆలంపూర్ బ్రిడ్జి &ఆలంపూర్ చౌరస్తా, శాంతినగర్, బళ్ళారి మీదుగా వెళతాయి.
అనంతపురము నుండి హైదరాబాదు వైపు వెళ్ళు వాహనాలు.
గుత్తి- జొన్నగిరి, తుగ్గలి, పత్తికొండ, ఆస్పరి, ఆదోని, మంత్రాలయం, మాధవరం, రాయచూరు, హైదరాబాదు మీదుగా వెళతాయి.
గుత్తి – జొన్నగిరి, తుగ్గలి, పత్తికొండ, ఆస్పరి, ఆదోని, ఎమ్మిగనూరు, నందవరం, నాగలదిన్నె, ఐజ, హైదరాబాదు మీదుగా వెళతాయి.
అనంతపురం నుండి నంద్యాల వైపు వైపు వెళ్ళు వాహనాలు.
అనంతపురము – ప్యాపిలి, ఎన్.రాచర్ల, బనగానపల్లె, పాణ్యం, నంద్యాల
డోన్ – బనగానపల్లె, నంద్యాల మీదుగా వెళతాయి.
బళ్ళారి నుండి హైదరాబాదు వైపు వెళ్ళు వాహనాలు.
ధనాపురం క్రాస్ – ఆదోని, మాధవరం, రాయచూరు, హైదరాబాదు
ఆదోని సిరిగుప్ప చెక్ పోస్టు – ఆదోని, ఎమ్మిగనూరు, నందవరం, నాగలదిన్నె, ఐజ, శాంతినగర్
ఉల్చాల వై జంక్షన్ – ఎల్కూరు బంగ్లా, విష్ణు టౌన్ షాపు, సంతోష్ నగర్ మీదుగా వెళతాయన్నారు.
నంద్యాల నుండి కర్నూలు వైపు వెళ్ళే వాహనాలు.
తమ్మరాజుపల్లి, బేతంచెర్ల, డోన్, కర్నూలు
తమ్మరాజుపల్లి, కాల్వబుగ్గ, ఎంబాయి, రామళ్లకోట, వెల్దుర్తి, కర్నూలు మీదుగా వెళతాయన్నారు.
ఓర్వకల్లు నుండి హైదరాబాదు వైపు వెళ్ళే వాహనాలు.
ఓర్వకల్లు కన్నమడకల, చౌట్కూరు, కడుమూరు, మిడ్తూరు, నందికొట్కూరు, హైదరాబాదు
పూడిచెర్ల, కేతవరం, గార్గేయపురం, బ్రాహ్మణకొట్కూరు, హైదరాబాదు
ఎల్లమ్మగుడి, పడిదెంపాడు, పూడూరు, ర్యాలంపాడు, ఆలంపూరు మీదుగా వాహనాలు వెళుతాయన్నారు.
అలాగే చాలా చోట్ల కార్యక్రమం ముగిసేంత వరకు లారీలు మరియు ఇతర భారీ వాహనాలు ఉదయం 8.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు ఆపివేయబడును.
కావున కర్నూలు పట్టణం మీదుగా ప్రయాణం చేయదలచిన వారు పై తెలిపిన ట్రాఫిక్ మళ్లింపు ను దృష్టిలో ఉంచుకొని పోలీసు వారికి సహకరించవలసిందిగా కర్నూలు జిల్లా ఎస్.పి. శ్రీ విక్రాంత్ పాటిల్, ఐ.పి.ఎస్. తెలిపారు.