ANDHRA PRADESHOFFICIALPOLITICSSTATE NEWS

మిడ్ పెన్నార్ ప్రాజెక్టు అభివృద్ధికి రూ.5.20 కోట్లు మంజూరు – రైతు సంక్షేమ దిశగా మరో చారిత్రాత్మక అడుగు

మిడ్ పెన్నార్ ప్రాజెక్టు అభివృద్ధికి రూ.5.20 కోట్లు మంజూరు – రైతు సంక్షేమ దిశగా మరో చారిత్రాత్మక అడుగు

ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ

బుక్కరాయసముద్రం అక్టోబర్ 12 యువతరం న్యూస్:

నియోజకవర్గ ప్రజల అభివృద్ధి పట్ల గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపుతున్న దృష్టి విశేషమైనది. అదే దిశగా మిడ్ పెన్నార్ ప్రాజెక్టు అభివృద్ధి పనుల నిమిత్తం రూ. 5.20 కోట్లు మంజూరు చేయడం పట్ల హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ నిధులతో మిడ్ పెన్నార్ ప్రాజెక్టులో రబ్బర్ సీల్స్ మార్పిడి, కొత్త వాక్‌వే బ్రిడ్జ్ నిర్మాణం, రేడియల్ క్రెస్ట్ గేట్లకు సాండ్ బ్లాస్టింగ్ మరియు పెయింటింగ్ పనులు చేపట్టబడనున్నాయి. ఈ చర్యల ద్వారా ప్రాజెక్టు యొక్క భద్రత, నిల్వ సామర్థ్యం, దీర్ఘకాలిక స్థిరత్వం మరింత బలపడుతుంది.
గత ఇరువై సంవత్సరాలుగా పరిష్కారం కాని మూడు ఎంపీ సౌత్ కెనాల్ స్లూయిస్ గేట్ల భర్తీ ఇప్పుడు సాధ్యమవుతోంది. దెబ్బతిన్న గేట్ల స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు చేయడం ద్వారా సుమారు 1 టీఎంసీ నీటి వృథా నివారించవచ్చు. గతంలో 8000 ఎకరాలకు అవసరమయ్యే సాగునీరు వృధాగా లీకేజ్ ద్వారా వెళ్ళేది దీనిని ఇప్పుడు నివారించి సాగునీరు అందించవచ్చును. దీని వలన రైతులకు సాగు నీరు నిరంతరంగా లభించడంతో పాటు ప్రజలకు త్రాగునీటి వనరులు మెరుగుపడతాయి.
నీటి నిల్వ సామర్థ్యం పెరగడం ద్వారా ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి అవకాశాలు కూడా విస్తరించనున్నాయి. ఈ మంజూరు అనంతపురం జిల్లా అభివృద్ధి పథంలో మరో చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుంది.
ఈ నిర్ణయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వం, రాష్ట్ర ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న అచంచల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
ఈ మంజూరులో ముఖ్యంగా సహకరించిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి సింగనమల ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!