రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు సత్వరం పరిష్కరించండి

రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు సత్వరం పరిష్కరించండి
ఇళ్ల స్థలాలు వెంటనే కేటాయించండి
కనీస పెన్షన్ సదుపాయం కల్పించండి
ఐ అండ్ పీఆర్ నూతన డైరెక్టర్ విశ్వనాథన్ తో ఫెడరేషన్ నేతలు వినతి
ఉత్తరాంధ్ర ప్రతినిధి
అక్టోబర్ 11 యువతరం న్యూస్
రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ఐ అండ్ పి ఆర్ నూతన డైరెక్టర్ గా నియమితులైన కె .విశ్వనాథన్ ను ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కార్యవర్గం కోరింది.. శనివారం ఇక్కడ వి ఎం ఆర్ డి ఏ కార్యాలయంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ, కార్యదర్శి జి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు బి శివప్రసాద్ లు నూతన డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని శేష వస్త్రంతో ఘనంగా సత్కరించారు.. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు అంశాలను డైరెక్టర్ దృష్టికి ఫెడరేషన్ నేతలు తీసుకువెళ్లారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పూర్తికావస్తున్న నేటికీ జర్నలిస్టులకు నూతన అక్రిడేషన్లు మంజూరు కాలేదన్నారు.. కనీసం ఇప్పటివరకు నూతన దరఖాస్తులు స్వీకరించలేదని వీరు చెప్పారు.. అలాగే చిన్న . మధ్యతరహా పత్రికలకు సంబంధించి తాజా జీవో ప్రకారం కొద్దిగా మార్పులు చేయాల్సి ఉందన్నారు..అలాగే సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను.. ఇతర రాష్ట్రాల మాదిరిగా పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరారు.. కనీస పెన్షన్ సదుపాయం కల్పించండి అని చెప్పారు.. ఇందుకు నూతన డైరెక్టర్ సానుకూలంగా స్పందించారు. తన పరిధి మేరకు జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు.. అలాగే ప్రభుత్వపరంగా పరిష్కరించాల్సిన సమస్యలు వారి దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు.. సోమవారం అమరావతిలో తాను బాధ్యతలు స్వీకరించినున్నట్లు డైరెక్టర్ చెప్పారు.