ANDHRA PRADESHOFFICIAL

నూతన జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొల్ల బత్తుల కార్తీక్

నూతన జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొల్ల బత్తుల కార్తీక్

నంద్యాల బ్యూరో అక్టోబర్ 11 యువతరం న్యూస్:

నంద్యాల కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం ఉదయం కొల్ల బత్తుల కార్తీక్ నూతన జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించగా, సహచర అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జాయింట్ కలెక్టర్ కొల్ల బత్తుల కార్తీక్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ జిల్లా పరిపాలనలో సమర్థత, పారదర్శకతను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రభుత్వ పథకాల ఫలితాలను ప్రజలకు చేరవేసే దిశగా అధికారులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!