ANDHRA PRADESHSTATE NEWS

పార్టీలకతీతంగా వాల్మీకులు ఏకం కావాలి

ఎమ్మెల్సీ మధుసూదన్,వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వలస రామకృష్ణ

పార్టీలకతీతం వాల్మీకులు ఏకం కావాలి

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

ఎమ్మెల్సీ మధుసూదన్, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వలస రామకృష్ణ

వెల్దుర్తి అక్టోబర్ 8 యువతరం న్యూస్:

వాల్మీకులు అందరూ పార్టీలకతీతంగా ఏకం కావాలని,వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎమ్మెల్సీ మధుసూదన్, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వలసల రామకృష్ణ లు పేర్కొన్నారు. బుధవారం గోవర్ధనగిరి గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథులుగా వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమం గ్రామ వాల్మీకి నాయకులు రామచంద్రుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాల్మీకి మహర్షి భారత దేశ సాంస్కృతి సాంప్రదాయాలకు పట్టు కొమ్మలాంటి వాడని రామాయణం లాంటి మహోన్నత మహిమాన్వితమైన గ్రంథ రచన చేసి ప్రపంచ మానవాళికి మానవత్వము ప్రేమ, ఆప్యాయతల శక్తి వంతమైన ఆనందాన్ని, జీవన మాధుర్యాన్ని, వ్యక్తి గత క్రమశిక్షణ వలన కలిగే మహోపకారాలను బోధించిన మహాకవి అని తెలిపారు. ఇహ పరాలను ప్రసాదించే అత్యంత శక్తివంతమైన రామ నామాన్ని అందించారని రామ నామ మంత్ర జపంతో ఎందరెందరో మహోన్నతులు తరించారని తెలిపాడు . భారత దేశవ్యాప్తంగా వాల్మీకులు ఎస్సీ ఎస్టీ జాబితాలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని జిల్లాలలో ఎస్టీలుగా కొనసాగుతున్నారని అన్నారు. నేతలు స్వార్థపూరితంగా చేసిన కుట్రల వల్ల ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని కొన్ని జిల్లాలలో వాల్మీకులు ఎస్టీ జాబితా నుండి తొలగించబడ్డారని అన్నారు.జరిగిన అన్యాయాన్ని దశాబ్దాలుగా పాలకుల దృష్టికి తీసుకు వస్తున్న స్పందించడం లేదని ఇప్పటికైనా పరిపాలకులు వాల్మీకులను ఎస్టీ జాబితాలో పునరుద్ధరించాలని కోరారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో పూర్తి చేయాలని కోరారు. కులవృత్తి లేని వాల్మీకులు రైతులు రైతు కూలీలుగా అనేక కష్టాలు అనుభవిస్తూ ఆర్థికంగా సామాజికంగా ఎంతో వెనుకబాటు గురయిపోయారని అన్నారు. అందువలన వాల్మీకులను వెంటనే ఎస్టీ జాబితాలో పునరుద్ధరించాలని అన్నారు. లేనిపక్షంలో ఉద్యమాల కైనా సిద్ధమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో
వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్, వలసల రామకృష్ణ, వెల్దుర్తి మండల వాల్మీకి సేవ అధ్యక్షులు గోపినాయుడు,ఆలూరు మాజీ జెడ్పిటిసి రాంభీమ్ నాయుడు, ఆస్పరి శ్రీనివాసులు, టీచర్ మద్దయ్య, సూదేపల్లి జయ రాముడు, రామలకోట మధవస్వామి డోన్ గోవిందు, గోనిగండ్ల రమేష్ నాయుడు, వెల్దుర్తి రామచంద్ర నాయుడు, వాల్మీకి శ్రీను, సిద్ధన గట్టు వెంకటేశ్వర్లు, బోగోలు కమలాకర్, బోయినపల్లి రాముడు, సిద్ధనగట్టు ప్రభాకర్, గోవర్ధనగిరి నాగమద్దయ్య, తలారి రంగన్న, రామచంద్రుడు, రమేష్,గోవిందు,మద్దిలేటి నాయుడు, మద్దయ్య, తదితరులు హాజరయ్యారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!