ప్రధాని పర్యటన కు పకడ్బందీ భద్రత
ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించిన కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ ఐపియస్, జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్

ప్రధాని పర్యటన కు పకడ్బందీ భద్రత
ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించిన
కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ ఐపియస్, జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
కర్నూలు క్రైమ్ అక్టోబర్ 9 యువతరం న్యూస్:
ఈ నెల 16 వ తేదీన కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ ఐపియస్, జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ లు పకడ్బందీ భద్రతా ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. ఈ సంధర్బంగా గురువారం కర్నూలు , ఓర్వకల్లు మండలం , నన్నూరు దగ్గర ఉన్న రాగమయూరి లో బహిరంగ సభ ప్రాంతం దగ్గర ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంలో ప్రధాని పర్యటన ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ మాట్లాడుతూ…
ప్రధాని మోదీ పర్యటించే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి సెక్టారు కు ఇంచార్జ్ లుగా , భద్రతా పర్యవేక్షణ అధికారులుగా పోలీసు ఉన్నతాధికారులు ఉంటారన్నారు. సిఐలు, ఎస్సైలు లైజనింగ్ ఆఫీసర్లుగా ఉంటారన్నారు. భద్రతా పరంగా ఎటువంటి లోటు పాట్లు లేకుండా చూడాలన్నారు. అధునాతన సాంకేతికత పరిజ్ఞానం వినియోగించాలన్నారు.
అనంతరం హెలిప్యాడ్ ప్రాంతాలు , వివిఐపి కాన్వాయ్ పర్యటించే ప్రాంతాలు, వివిఐపి గ్యాలరీలు, పబ్లిక్ గ్యాలరీల ను జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్, డిఎస్పీలు , స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిఐలు, ఆర్ ఐలు ఎస్సైలు పాల్గొన్నారు.