లాడ్జీలలో , చెక్ పాయింట్లలలో ముమ్మరంగా తనిఖీలు

లాడ్జీలలో , చెక్ పాయింట్లలలో ముమ్మరంగా తనిఖీలు
కర్నూల్ క్రైమ్ అక్టోబర్ 9 యువతరం న్యూస్:
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు అక్టోబర్ 16న కర్నూలు కు ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో, భద్రతా కారణాల దృష్ట్యా కర్నూలు పట్టణ సరిహద్దులలో మరియు ప్రధాన మార్గాల్లో చెక్పాయింట్లు ఏర్పాట్లు చేసి తనిఖీలు చేపట్టాలని, లాడ్జీలలో తనిఖీలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఈ సంధర్బంగా
కర్నూలు తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలోని పూల్లురు టోల్గెట్, కర్నూలు త్రీ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో నంద్యాల చెక్ పోస్టు, కర్నూలు నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో ఉల్చాల రోడ్డు జంక్షన్, గుత్తి పెట్రోల్ దగ్గర ఓర్వకల్లు పోలీసుస్టేషన్ పరిధిలోని నన్నూరు టోల్ గేట్ దగ్గర చెక్ పాయింట్లను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. ఈ చెక్ పాయింట్ల లలో , లాడ్జీలలో పోలీసు అధికారులు, స్పెషల్ పార్టీ పోలీసులు అనుమానిత వ్యక్తులను లేదా వస్తువులను గుర్తించడానికి పకడ్బందీగా తనిఖీలు చేపట్టారు.
ప్రధానమంత్రి పర్యటించే మార్గాల్లో, ముఖ్యంగా సందర్శించే ప్రాంతాల చుట్టూ కర్నూలు పోలీసులు నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.