నంద్యాలలో జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి

నంద్యాలలో జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి
ఆత్మకూరు పట్టణంలో నిరసన తెలిపిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు
ఆత్మకూరు ప్రతినిధి అక్టోబర్-9 యువతరం న్యూస్:
ఆత్మకూరు పట్టణంలో డివిజన్ పరిధిలో ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు గురువారం నంద్యాల-3 టౌన్ సిఐ- కంబగిరి.రాముడు జర్నలిస్టులపై కేసులు నమోదు చేశారని, ఈ కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఆత్మకూరు గెస్ట్ హౌస్ నుండి గౌడ్ సెంటర్ మీదుగా మండల తహాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలని, జర్నలిస్టుపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేస్తూ మండల తహాసిల్దార్-జీ.రత్న రాధిక కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ పత్రిక స్వేచ్ఛను కాల రాస్తున్నారని, జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తహాసిల్దార్- జి.రత్నరాధిక కు తెలియజేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డివిజన్ పరిధిలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేఖరులు పాల్గొన్నారు.