
షెడ్యూల్ ప్రాంత చట్టాలను కాలరాయొద్దు
ఏజెన్సీ ప్రాంతాల్లో జడ్పిటిసి స్థానం గిరిజనేతరులకు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం
ఆదివాసీ యువతి,యువకులు స్వతంత్ర అభ్యర్థుల బరిలో ఉండాలని జి ఎస్ పి పిలుపు
గొండ్వానా సంక్షేమ పరిషత్
ములుగు ప్రతినిధి అక్టోబర్ 9 యువతరంన్యూస్:
వెంకటాపురం మండలంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి మీడియా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు,ఈ సమావేశంలో పూనెం సాయి మాట్లాడుతూ,, ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులకు అవకాశం కల్పిస్తూ జనరల్ చేయడం అనేది రాజ్యాంగాన్ని ఉల్లంగిస్తు ఖుని చేయడమేనని మండి పడ్డారు,1/70 చట్టానికి విరుద్ధంగా ఏజెన్సీ ప్రాంతానికి వలస వచ్చిన గిజనేతరులకు ఎలా జడ్పిటిసి స్థానాలు ఇస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, ఏజెన్సీ ప్రాంతం లో స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆదివాసీ రిజర్వేషన్ ని గిరిజనేతరులకు పంచి పెట్టడం, దోచి పెట్టడం రాజ్యాంగ వ్యతిరేకం అని అన్నారు, ఏజెన్సీ లో ఐదవ షెడ్యూల్ భూభాగంలో పేసా చట్టం ప్రకారం గిరిజనేతరులు పోటీ చేయడం, రాజ్యాంగ బద్ద పదవులలో ఉండటం రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు, దీనిపై ఇంత జరుగుతున్న ఆదివాసీ ఎమ్మెల్యే లు మాట్లాడకుండా ఉండటం దురదృష్ట కరమని అన్నారు, ఇప్పుడు ఆదివాసీ ప్రజలు ఆలోచన చేయకపొతే రేపు ఏజెన్సీ లో ఎమ్మెల్యే సీట్లు కూడా జనరల్ అయ్యో పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు,ఏజెన్సీ చట్టాలను దిక్కరిస్తూ జనరల్, బిసిలుగా కొన్ని జడ్పిటిసి లను రిజర్వడ్ చేయడాన్ని తీవ్ర స్థాయిలో ఖండించాలని ఆయన పిలుపు నిచ్చారు, పూర్తి ఏజెన్సీ ప్రాంతాలలో స్వయం పాలనా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆదివాసీ చట్టాలను ఉల్లంగించే పార్టీలకు తగిన బుద్ది చెప్పేందుకు ఆదివాసీ యువత, మహిళలు పెద్ద ఎత్తున స్వతంత్ర అభ్యర్థుల బరిలో ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు.