జనసేన చొరవతో రోడ్డు పనులు

జనసేన చొరవతో రోడ్డు పనులు
దేవనకొండ అక్టోబర్ 8 యువతరం న్యూస్:
జనసేన చొరవతో రోడ్డు పనులు అధికారులు చేపట్టుతున్నారని జనసేన నాయకులు రామాంజనేయులు, ఉచ్చిరప్ప తెలిపారు. వారు మాట్లాడుతూ జనసేన వినతి మేరకు డిజే రంగస్వామి ఇంటి నుండి కొత్త పేట క్రాస్ రోడ్డు వరకు మట్టి రోడ్డు వేయాలని అధికారులను కోరమన్నారు. జనసేన విన్నపం మేరకు అధికారులు ,సర్పంచ్, కూటమి నాయకులు రోడ్డుకు ఇరువైపులా ముళ్ళ పొదలను తొలగించి హిందూ రుద్రభూమి వరకు రోడ్డుపై మట్టిని వేసినందుకు జనసేన నాయకులు , ప్రజలు హర్షం వ్యక్తం చేశారన్నారు.అలాగే హిందూ రుద్ర భూమి నుండి కొత్తపేట హైవే రోడ్డు వరకు కూడా ముళ్ళ చెట్లను తొలగించి మట్టి రోడ్డును వేస్తే రైతులకు, ప్రయాణికులకు చాలా సౌకర్యం కలుగజేసిన వారావుతారు. కావున ఈ పనికూడా అధికారులు, కూటమి నాయకులు పూర్తి చేయడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఉదయ్ కుమార్,వీరేష్, టిడిపి నాయకులు రాజా సాహెబ్, మక్బూల్, ముళ్ళ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.