ANDHRA PRADESHBREAKING NEWSOFFICIALSTATE NEWS

ప్రధాన మంత్రి పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను పకడ్బందీగా చేయండి

మంత్రి టీజీ భరత్

ప్రధాన మంత్రి పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను పకడ్బందీగా చేయండి

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్

కర్నూలు రూరల్ అక్టోబర్ 08 యువతరం న్యూస్:

జిల్లాలో ఈ నెల 16 వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్న సందర్భంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా నన్నూరు టోల్ గేట్ దగ్గర ఉన్న రాగమయూరి వద్ద పార్కింగ్, హెలిప్యాడ్, సభా ప్రాంగణం ఏర్పాట్లను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు టీజీ భరత్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న ప్రధాన మంత్రి పర్యటనను ప్రజా ప్రతినిధులు, అధికారులు సమష్టి కృషితో విజయవంతం చేయాలన్నారు. హెలిప్యాడ్ , సభా ప్రాంగణం, ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!