ANDHRA PRADESHSPORTS NEWSSTATE NEWS

రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ క్రీడా పోటీలకు శకునాల పాఠశాల విద్యార్థులు

రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ క్రీడా పోటీలకు శకునాల పాఠశాల విద్యార్థులు

కర్నూలు ప్రతినిధి అక్టోబర్ 7 యువతరం న్యూస్:

జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్ జి ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా జట్ల ఎంపిక పోటీలలో తమ పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభాపాటవాలన ప్రదర్శించి జిల్లా జట్లకు ఎంపికైనట్లు ఓర్వకల్ మండల పరిధిలోని శకునాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని సునీత తెలిపారు. మంగళవారం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న మూడు శాతం స్పోర్ట్స్ కోటా కింద భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవచ్చని కోరారు. రాష్ట్రస్థాయి పోటీలలోనూ విద్యార్థులు క్రీడల్లో రాణించి పథకాలు సాధిస్తే పాఠశాల తరపున వారికి ప్రోత్సాహకాలను ప్రకటిస్తామన్నారు. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయులు మహమ్మద్ భాష నరసింహులు మాట్లాడుతూ కర్నూలు నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో సోమవారం జరిగిన రగ్బీ అండర్ 14 బాలుర విభాగంలో మణిజయవర్ధన్, బాలికల విభాగంలో వెంకట హేమ, ఎంపిక కాగా అండర్ 17 విభాగంలో ప్రసన్న రాణి ఎంపికయ్యారు. అండర్ 17 బాలికల విభాగంలో స్టాండ్ పైగా మాధవి ఎంపికయ్యారు.
అలాగే సెప్టెంబర్ 15వ తారీఖున నిర్వహించిన నెట్ బాల్ అండర్ 14 బాలికల విభాగంలో ఉమామహేశ్వరి ఎంపికయ్యారన్నారు. రైఫిల్ షూటింగ్ అండర్ 14 బాలుర విభాగంలో బి మణి జయవర్ధన్, బి లిథిన్,బాలికల విభాగంలో లిస్మిత ఎంపికయ్యారని తెలిపారు. అండర్ 17 బాలుర విభాగంలో బి చిన్న రాముడు స్టాండ్ బైగా,బాలికల విభాగంలో సైదాబీ, ప్రశాంతి ఎంపిక కాగా అండర్ 19 బాలికల విభాగంలో ఇంద్రావతి, మనీషా, శ్వేత, భూమిక, రేణుక, బాలుర విభాగంలో బి మణిదీప్ ఎంపికయ్యారని తెలిపారు. వీరు త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఎంపికైన విద్యార్థిల తో పాటు వారికి క్రీడల్లో శిక్షణ ఇచ్చిన వ్యామ ఉపాధ్యాయులు మహమ్మద్ భాష, నరసింహులు ను పాఠశాల ప్రధానోపాధ్యాయిని సునీత, ఉపాధ్యాయ ఉపాధ్యాయ తర సిబ్బంది అభినందించారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!