ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి రాష్ట్ర స్థాయి అధికారులతో జిల్లా అధికారులు సమన్వయం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి

ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి రాష్ట్ర స్థాయి అధికారులతో జిల్లా అధికారులు సమన్వయం చేసుకోవాలి
విధి నిర్వహణలో స్పష్టత తో పని చేయాలి
ప్రధానమంత్రి కార్యక్రమం స్పెషల్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ అధికారి వీర పాండియన్
ఆయా జిల్లా అధికారులకు కేటాయించిన విధులను
పొరపాట్లకు తావివ్వకుండా సక్రమంగా నిర్వర్తించాలి
జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి
కర్నూలు ప్రతినిధి అక్టోబర్ 07 యువతరం న్యూస్:
జిల్లాలో ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి రాష్ట్ర స్థాయి అధికారులతో జిల్లా అధికారులు సమన్వయం చేసుకోవాలని ప్రధానమంత్రి ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ అధికారి వీర పాండియన్ ఆదేశించారు.
మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, విధులు కేటాయించిన అధికారులతో స్పెషల్ ఆఫీసర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రధానమంత్రి కార్యక్రమం నిర్వహించేందుకు రాష్ట్రస్థాయి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. వీరంతా గతంలో ప్రధానమంత్రి పర్యటన కార్యక్రమాల విధులను నిర్వర్తించిన వారన్నారు. జిల్లాస్థాయిలో జిల్లా అధికారులకు విధులు కేటాయిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి అధికారులతో జిల్లా అధికారులు మాట్లాడి, కోఆర్డినేట్ చేసుకుని విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు. విధుల నిర్వహణలో స్పష్టత కలిగి ఉండాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి ఆయా ఏర్పాట్లకు సంబంధించి విధులు కేటాయించిన అధికారులతో మాట్లాడారు. పార్కింగ్ కు సంబంధించి 11 ప్రదేశాలు ఏర్పాటు చేశామని, ఇందుకోసం వివిధ శాఖల అధికారులను ఇన్చార్జిలుగా నియమించామని, వివిధ జిల్లాల నుండి తెప్పించిన జెసిబి లతో ఈ ప్రాంతాల్లో త్వరితగతిన లెవెలింగ్, బుష్ క్లియరెన్స్ వంటి పనులు పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. వివిఐపి లకు, వీఐపీలకు గ్రీన్ రూమ్ ఏర్పాట్లను చూడాలని జాయింట్ కలెక్టర్ ను ఆదేశించారు. పబ్లిక్ మీటింగ్ దగ్గర చేయాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదోని సబ్ కలెక్టర్ ను ఆదేశించారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తదితర వీఐపీలకు కాన్వాయ్ వాహనాలను ఏర్పాటు పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిటిసి ని ఆదేశించారు. అలాగే ప్రజల కోసం బస్సుల ఏర్పాటుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఆర్ ఎం ను ఆదేశించారు. సేఫ్ రూమ్, స్పెషలిస్ట్ డాక్టర్స్, మెడికల్ టీమ్స్, అంబులెన్స్ తదితర అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ సూపరింటెన్డెంట్, డిఎంహెచ్వో ను ఆదేశించారు. సభకు హాజరయ్యే ప్రజలకు తాగునీరు, భోజన వసతి, పారిశుధ్యం, హెలిప్యాడ్ ల నిర్మాణం, విద్యుత్ సరఫరా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఎల్ ఈ డి స్క్రీన్స్ ఏర్పాటు, కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్షించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఆర్ అండ్ బి ఎస్ ఈ మహేశ్వర్ రెడ్డి, కమర్షియల్ టాక్స్ జాయింట్ కమిషనర్ నీరజ, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ, హౌసింగ్ పీడీ చిరంజీవి, హాస్పిటాల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డిఎంహెచ్వో శాంతి కళ, డిఆర్డిఏ పిడి రమణారెడ్డి డిపిఓ భాస్కర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ కుమార్, డిటిసి శాంతకుమారి, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం ఉదయం, సాయంత్రం జిల్లా కలెక్టర్ నన్నూరు రాగ మయూరి గ్రీన్ హిల్స్ కు వెళ్లి అక్కడ ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లను, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు.