అక్టోబర్ 16 న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూల్ రాక

అక్టోబర్ 16 న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూల్ రాక
ప్రధాన మంత్రి భద్రత ఏర్పాట్ల పై జిల్లా లైజనింగ్ , సెక్టార్ లైజనింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్
ప్రతి ఒక్కరూ విధుల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి
కర్నూలు క్రైమ్ అక్టోబర్ 6 యువతరం న్యూస్:
అక్టోబర్ 16 వ తేదీన జిల్లాలో ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు అధికారులు భద్రతాపరంగా పకడ్బందీ ఏర్పాట్లు, బందోబస్తు సిద్ధం చేసుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో లైజనింగ్ అధికారులు , సెక్టార్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…
ప్రధానమంత్రి పర్యటన నిమిత్తం వీవీఐపీలు, డిజిపి, ఐజి,డీఐజీ స్థాయి వంటి ఐపీఎస్ అధికారులు జిల్లాకు వస్తుంటారని లైజనింగ్ ఆఫీసర్లు, సెక్టర్ ఇన్చార్జి లైజనింగ్ అధికారులు విధుల పట్ల బాధ్యతాయుతంగా అప్రమత్తంగా ఉండాలన్నారు.
రూట్ లు, పార్కింగ్ ప్రదేశాలు , వసతి సౌకర్యాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎయిర్పోర్టు, రోడ్డు డైవర్షన్స్ , చెక్ పాయింట్లు, ట్రాఫిక్ నియంత్రణ పై తీసుకోవాల్సిన చర్యల పై పలు ఆదేశాలు జారీ చేశారు.
సమన్వయంతో పని చేయాలన్నారు. దాదాపు 6 వేల మంది ఫోర్స్ జిల్లాకు రావచ్చన్నారు.
అక్టోబర్ 13వ తేదీ ఫోర్స్ రిపోర్ట్ చేసుకుంటారన్నారు.
అక్టోబర్ 14వ తేదీ ట్రయల్ రన్ నిర్వహిస్తారన్నారు.
జిల్లాలోని ఆయా నియోజక వర్గాల నుండి బస్సులలో ప్రజలు నన్నూరు టోల్ ప్లాజా దగ్గర ఉన్న రాగమయూరి లో ఏర్పాటు చేసే ప్రధానమంత్రి బహిరంగ సభ కు ప్రజలు వస్తారన్నారు.
బస్సు రూట్ లలో రోడ్డు సరిగా లేని చోట గుర్తించాలన్నారు.
ప్రమాదాలు జరగకుండా సరిచేయించాలన్నారు.
ప్రజల సురక్షితంగా బహిరంగ సభకు చేరుకునే రోడ్డు భద్రత పై చర్యలు తీసుకోవాలన్నారు.
రేపు (మంగళ వారం) సాయంత్రం జిల్లా కు ఏపీ డీజిపీ వస్తారన్నారు.
బుధవారం ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్, డీఎస్పీలు సిఐలు, ఆర్ఐలు,ఎస్సైలు పాల్గొన్నారు.