గ్యాస్ లీక్ తో ఘోర ప్రమాదం

గ్యాస్ లీక్ తో ఘోర ప్రమాదం
వెల్దుర్తి అక్టోబర్ 6 యువతరం న్యూస్:
గ్యాస్ లీక్ తో ఘోర ప్రమాదం జరిగిన సంఘటన వెల్దుర్తి మండలంలోని ఎస్ బోయినపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేస్తుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన నాగరాజు, సువర్ణ దంపతులు తోపాటు వారి ఇద్దరు పిల్లలు అనిల్,చరణ్ ఆదివారం వారి ఇంట్లో నిద్రించడం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి లేచిన నాగరాజు లైట్ స్విచ్ వేయడంతో అప్పటికే గ్యాస్ లీక్ అయి ఇంటి నిండా నిండుకోవడం వల్ల మంటలు చెలరేగినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో నలుగురికి మంటలు వల్ల శరీరం కాలినట్లు గ్రామస్తులు తెలిపారు. అంతేకాకుండా సువర్ణ ప్రస్తుతం ఐదవ గర్భవతి అని పేర్కొన్నారు.భారీ పేలుడు శబ్దం రావడంతో ఇంటి చుట్టుపక్కల గ్రామస్తులు అక్కడికి చేరుకొని వారిని ఇంటి బయటకు తీసుకొని వచ్చినట్టు తెలిపారు. వెంటనే వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాల కు తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియ రావలసి ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అశోక్ తెలిపారు. ఈ సంఘటన పట్ల గ్రామ నాయకులు నర్సింగ్ కాంతారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది.