ANDHRA PRADESHOFFICIALSTATE NEWS

ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కలసి పని చేసినప్పుడే “స్వచ్ఛ ఆంధ్ర” సాధ్యమవుతుంది

రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రివర్యులు టీజీ భరత్

ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కలసి పని చేసినప్పుడే “స్వచ్ఛ ఆంధ్ర” సాధ్యమవుతుంది

స్వచ్ఛత అంటే కేవలం శుభ్రత మాత్రమే కాదని, ఆరోగ్య కరమైన సమాజానికి పునాది

రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రివర్యులు టీజీ భరత్

కర్నూలు టౌన్ అక్టోబర్ 06 యువతరం న్యూస్:

ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కలసి పని చేసినప్పుడే “స్వచ్ఛ ఆంధ్ర” సాధ్యమవుతుందని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రివర్యులు టీజీ భరత్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానం జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ మధ్యనే జపాన్ దేశం పర్యటనకు వెళ్లడం జరిగిందని , జపాన్ లో చెత్త నుండి ఆదాయం వచ్చే విధంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం అక్కడ చెత్త వేయటానికి చెత్తబుట్టలు లేవని, వారు చెత్తను నిర్దిష్టమైన స్థలాల్లో మాత్రమే చెత్త వేయటానికి చెత్తబుట్టలు ఉంటాయన్నారు. ఆ విధంగా వారు చేయడం, పరిశుభ్రత పాటించడం వలన స్వచ్ఛమైన పర్యావరణాన్ని సమకూర్చుకోగలిగారని తెలియజేశారు. వారు ఆ స్థితికి రావడానికి దాదాపు 30 సంవత్సరాలు పట్టిందన్నారు. కర్నూలు నగరంలో వర్షానికి కాలువలు నిండిపోయి ఇబ్బందులకు గురి అవడానికి ముఖ్య కారణం మన ఇంటిలోని చెత్తను కాలువలో వేయటం అన్నారు. దీన్ని మనము అరికట్టి కర్నూలు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు. అవార్డులు రానివారు అవార్డులు వచ్చిన వారిని స్పూర్తిగా తీసుకొని వచ్చే సారి అవార్డులు తెచ్చుకోవాలన్నారు. జపాన్ లో హైడ్రోజన్ ను ఇంధనం గా వినియోగించి కార్లు వాడుతున్నారని, మనం ఆ టెక్నాలజీని అలవర్చుకోవడానికి ఇంకా ఆలోచిస్తూ ఉన్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సర్కులర్ ఎకనామిక్ పై ఆలోచిస్తూ ఉన్నారన్నారు. వాడేసిన ఖాళీ సీసాలు తిరిగి వాడుకలోకి తీసుకుని రావడానికి ప్రభుత్వము నుండి చర్యలు ఉంటాయన్నారు.ఈ విధంగా చేయడం వల్ల వేస్ట్ నుండి వివిధ రకాలుగా ఇతర ఉపయోగాలు ఉంటాయని ఆ విధంగా కర్నూల్ లో కూడా వేస్ట్ నుండి కరెంటు ఉత్పత్తి చేసే చర్యలు తీసుకుంటున్నామని కర్నూలు ను పరిశుభ్రంగా ఉంచి పర్యావరణాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు.
జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర తోనే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల మూడవ శనివారం స్వచ్ఛత హి సేవ అనే నినాదంతో కార్యక్రమాలను మొదలు పెట్టడం జరిగిందన్నారు. ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం భారతదేశమన్నారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అదే విధంగా ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా, ఉమ్మి వేయకుండా ఉండాలని అప్పుడే స్వచ్ఛ్ ఆంధ్ర స్వచ్ఛభారత్ సాధించుకోగలుగుతామన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా మే నెలలో జిల్లా పర్యటనకి రావడం జరిగిందన్నారు. పాణ్యం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు సీఎం అస్యూరెన్స్ కింద 50 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రధానం చేసేందుకు 8 నెలలు జరిగిన స్వర్ణాంధ్ర స్వచంద్ర కార్యక్రమంలో సెల్ఫ్ అసెస్మెంట్ చేయమని ప్రభుత్వం చెప్పడం జరిగిందన్నారు. అందులో భాగంగానే రాష్ట్రస్థాయిలో గెలుపొందిన వారికి రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో గెలుపొందిన వారికి జిల్లా స్థాయిలో సోమవారం అవార్డులను ప్రధానం చేయడం జరిగిందన్నారు. అవార్డులు రానివారు గెలుపొందిన వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చే సారి అవార్డులు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రజలు కూడా చెత్తను తడి పొడి చెత్తగా వేరుచేసుకొని పెట్టుకోవాలన్నారు.
అనంతరం ఉత్తమ స్వచ్ఛ మున్సిపాలిటీ, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, స్వచ్ఛ స్లామ్ లెవెల్ ఫెడరేషన్, స్వచ్ఛ రైతు బజార్, స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్, స్వచ్ఛ బస్ స్టేషన్, స్వచ్ఛ ఎన్జీఓ లు, స్వచ్ఛ ఆసుపత్రి, స్వచ్ఛ పాఠశాల, స్వచ్ఛ అంగన్వాడి, స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛ హాస్టల్ లు, స్వచ్ఛ పరిశ్రమలు, స్వచ్ఛ రెసిడెన్షియల్ పాఠశాలలు, స్వచ్ఛ పారిశుధ్య కార్మికులు, స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్ లకు మంత్రి, జాయింట్ కలెక్టర్ అవార్డ్ లను ప్రధానం చేశారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, ఐసిడిఎస్ పిడి విజయ, అదనపు మున్సిపల్ కమిషనర్ కృష్ణ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ విశ్వేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!