అంగరంగ వైభవంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి నిమజ్జనోత్సవం

అంగరంగ వైభవంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి నిమజ్జనోత్సవం
పెద్దవడ్లపూడిలో మేళతాళాల మధ్య నిమజ్జన కార్యక్రమం
మంగళగిరి ప్రతినిధి అక్టోబర్ 5 యువతరం న్యూస్:
మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామంలో శనివారం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి నిమజ్జనోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. అమ్మవారిని పూలతో, అలంకరించిన ఊరేగింపులో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ వీధులన్నీ అమ్మవారి జయజయధ్వానాలతో మార్మోగాయి. మేళతాళాలు, కనకతప్పట్ల సవ్వడులు వాతావరణాన్ని ఉత్సవమయం చేశాయి…ఈ సందర్భంగా మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్‌చందు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. . గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు నిమజ్జన ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని “జై కనకదుర్గమ్మ” అంటూ భక్తి జ్వాలలు రగిలించారు. గ్రామ యువత సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు..ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులతో గ్రామానికి సుభిక్షం, శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.నిమజ్జనోత్సవం అనంతరం భక్తులు అమ్మవారి నామస్మరణతో ముగ్ధులయ్యారు.