సీఎం, డిప్యూటీ సీఎం నారా లోకేష్ ల చిత్రపటాలకు పాలాభిషేకం
కొత్తపేటలో ఆటో డ్రైవర్ల సమక్షంలో రంగిశెట్టి నరేంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమం

సీఎం, డిప్యూటీ సీఎం నారా లోకేష్ ల చిత్రపటాలకు పాలాభిషేకం
కొత్తపేటలో ఆటో డ్రైవర్ల సమక్షంలో రంగిశెట్టి నరేంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమం
మంగళగిరి ప్రతినిధి అక్టోబర్ 5 యువతరం న్యూస్:
ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా శనివారం ఆటో సోదరులకు రూ.15 వేలు నగదును జమ చేశారు. ఈ సందర్భంగా మంగళగిరి పట్టణంలోని కొత్తపేట 1,2 వార్డులలో ఆటో సోదరులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ బాబు ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆటో డ్రైవర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 2 వ వార్డు మాజీ కౌన్సిలర్ రంగిశెట్టి నరేంద్ర (బాబి) శివాలయం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ సుఖమంచి గిరీబాబు, టౌన్ కమిటీ మెంబర్ తాడిగిరి సుధీర్, 2 వ వార్డు అధ్యక్షులు కట్ట దుర్గాప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఫణిదపు మల్లేశ్వరరావు 1వ వార్డు అధ్యక్షుడు సైనాదం శ్రీనివాసరావు పూజల శ్రీనివాసరావు పెద్దబ్బాయి మంగళగిరి శ్రీనివాసరావు బండారు రమేష్ కొనీశెట్టి దుర్గారావు సజ్జ సాయి కుమార్ రాగవరపు గోపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.