ANDHRA PRADESHCRIME NEWSOFFICIAL

గంజాయి విక్రయదారుల అరెస్ట్ – విద్యార్థులే లక్ష్యంగా  గంజాయి ముఠా కార్యకలాపాలు

ఆరుగురిని పట్టుకుని రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

గంజాయి విక్రయదారుల అరెస్ట్ – విద్యార్థులే లక్ష్యంగా  గంజాయి ముఠా కార్యకలాపాలు

ఆరుగురిని పట్టుకుని రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన గ్రామీణ సీఐ వై శ్రీనివాసరావు, ఎస్సై చిరుమామిళ్ల వెంకట్

గంజాయి విక్రయించిన, వినియోగించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు

యువకులు విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కావద్దని, మాదకద్రవ్యాల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని వారు సూచించారు.

మంగళగిరి ప్రతినిధి అక్టోబర్ 5 యువతరం న్యూస్:

యువకులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయ కార్యకలాపాలు సాగిస్తున్న ముఠాను మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు.. ఈ సందర్భంగా ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుండి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో మారక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ను ప్రారంభించారు. ఆదివారం మంగళగిరి గ్రామీణ పోలీస్ సర్కిల్ అధికారి కార్యాలయంలో ఈ మేరకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. మంగళగిరి గ్రామీణ సిఐ వై శ్రీనివాసరావు ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ లు మీడియాతో మాట్లాడుతూ
బేతపూడి గ్రామానికి చెందిన బేతపూడి చందు,, పెద్దవడ్లపూడికి చెందిన జొన్నలగడ్డ ఆనంద్‌, మంగళగిరి బాప్టిస్ట్‌ పేటకు చెందిన బుల్లా రవి, ఆత్మకూరు గ్రామానికి చెందిన కొండిటి తేజ మంగళగిరి టిప్పర్లబజార్‌కు చెందిన కంచర్ల చైతన్య, నిడమర్రు గ్రామానికి చెందిన దూరు లక్ష్మణరావు లు ఇంకా ఇద్దరు నిందితులు — నవులూరు గ్రామానికి చెందిన సత్విక్, నిడమర్రుకు చెందిన నగేష్ పరారీలో ఉన్నారని సిఐవై శ్రీనివాసరావు, ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ లో తెలిపారు… ఈ కేసులో పట్టుబడిన నిందితులు అందరూ 25 సంవత్సరాల లోపు యువకుల కావడం గమనార్హం అని వారు తెలిపారు. ప్రధాన నిందితులు విశాఖపట్నం జిల్లా పాడేరు కొండ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తుల వద్ద నుండి కిలోకు ఐదు వేల రూపాయల చొప్పున గంజాయిని కొనుగోలు చేసి, చిన్న చిన్న పొట్లాలుగా మార్చి ఒక్కొక్క పొట్లాను ఐదు వందల రూపాయలకు అమ్మేవారని వారు తెలిపారు. యువకులు, విద్యార్థులు వారికి ప్రధాన కొనుగోలుదారులని, వీరిని ఆకర్షించడానికి సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు పెంచుకున్నారని విచారణలో బయటపడినట్లు వారు తెలిపారు..తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సదరు నిందితులు ఒకరికి ఒకరు పరస్పరం తోడ్పాటునిస్తూ గంజాయి కొనుగోలు, పొట్లాలు తయారు చేయడం, అమ్మకం వంటి పనులను పంచుకుని గంజాయి కార్యకలాపాలు కొనసాగించినట్లు వారు పేర్కొన్నారు.. ఇటీవల పాడేరు ప్రాంతం నుండి తెచ్చుకున్న రెండు కిలోల గంజాయిని మంగళగిరి అంతర్జాతీయ క్రీడా మైదానం సమీపంలో పంపిణీ చేయడానికి సిద్ధమవుతుండగా పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నట్లు వారు చెప్పారు. మద్యవర్తుల సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితులను న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నట్లు గ్రామీణ సియవై శ్రీనివాసరావు గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ లు తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరిని కూడా త్వరలో పట్టుకుంటామని వారు స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తులో సీఐ,ఎస్ఐ లతోపాటు సిబ్బంది ఏఎస్ఐ రమేష్, హెడ్ కానిస్టేబుల్ అంకమ్మరావు, కానిస్టేబుల్ లు రాము, సాగర్ బాబు, పాల్గొని మెరుగైన పనితీరును ప్రదర్శించినట్లు అధికారులు తెలిపారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!