ANDHRA PRADESHOFFICIAL

ఆటో డ్రైవర్ల సేవలో” పథకం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆనంద్ ,ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ

ఆటో డ్రైవర్ల సేవలో” పథకం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న
జిల్లా కలెక్టర్ ఆనంద్ ,ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ

బుక్కరాయసముద్రం అక్టోబర్ 05 యువతరం న్యూస్:

“ఆటో డ్రైవర్ల సేవలో” పథకం ప్రారంభం సందర్భంగా, నియోజకవర్గ స్థాయి కార్యక్రమం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ముసలమ్మ కట్ట నుంచి ఆటో ర్యాలీని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ , ఏడీసీసీ చైర్మన్ కేశవ రెడ్డి టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసరావు నాయుడు తో కలిసి స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి ఆటోలో ప్రయాణిస్తూ, డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అలాగే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాక, కూటమి ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకం గురించి వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నారు. అనంతరం విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్న “ఆటో డ్రైవర్ల సేవలో” కార్యక్రమాన్ని వీక్షించారు.

ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మాట్లాడుతూ –
“కూటమి ప్రభుత్వం సంక్షేమ దిశగా పెద్దఎత్తున పథకాలు అమలు చేస్తోంది. వాటిలో భాగంగా ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని కూడా ప్రారంభించింది. ఆటో, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఆర్థికంగా అండగా నిలబడేందుకు అర్హులైన వారికి రూ.15,000 చొప్పున అందజేయడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా 1,643 మందికి మొత్తం రూ.2,47,25,000 లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. ఇచ్చిన హామీ మేరకు డబ్బు నేరుగా జమ కావడంతో ఆటో డ్రైవర్ల కుటుంబాలలో ఆనందానికి అవధులు లేవు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడమే కాకుండా, ఇప్పుడు ఈ కొత్త పథకాన్ని కూడా పటిష్టంగా అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం రూ.10,000 మాత్రమే ఇచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం అదనంగా 50 శాతం పెంచి రూ.15,000 అందిస్తోంది. అంతేకాక, వైసీపీ ప్రభుత్వం విధించిన రూ.20,000 గ్రీన్ టాక్స్‌ను తగ్గించి రూ.3,000 మాత్రమే వసూలు చేస్తూ డ్రైవర్లకు పెద్దఎత్తున ఉపశమనం కల్పించింది.” అని పేర్కొన్నారు.
ఫిర్యాదుల కోసం:
మన మిత్ర వాట్సాప్ ప్రత్యేక వ్యవస్థ – 9552300009*
అర్హత ఉండి కూడా జాబితాలో పేరు లేకుంటే, వాట్సాప్ ద్వారా ప్రత్యేక గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. లబ్ధిదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌లో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి అధికారులు,కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!