అమ్మవారి నవరాత్రి నిమజ్జనోత్సవాల్లో భక్తి వైభవం

అమ్మవారి నవరాత్రి నిమజ్జనోత్సవాల్లో భక్తి వైభవం
మంగళగిరి ప్రతినిధి అక్టోబర్ 5 యువతరం న్యూస్:
మంగళగిరి పట్టణంలోని ఇంద్రానగర్ మున్సిపల్ రోడ్‌లో అమ్మవారి నవరాత్రి నిమజ్జనోత్సవాలు శనివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అమ్మవారి విగ్రహం వద్ద పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అనంతరం నిమజ్జన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి పాల్గొన్నారు. భక్తులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆరుద్ర సత్యం, కోగంటి బాబి ఆధ్వర్యంలో సుమారు 2000 వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆరుద్ర భూలక్ష్మి స్వయంగా భక్తులకు ప్రసాదం అందజేశారు.ఈ సందర్భంగా ఆరుద్ర భూలక్ష్మి మాట్లాడుతూ, నవరాత్రి ఉత్సవాలు భక్తి, శ్రద్ధ, సత్సంకల్పాలకు ప్రతీకలని పేర్కొన్నారు. అమ్మవారిని ఆరాధించే ప్రతి భక్తునికి శాంతి, సంపద, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఉత్సవాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని, మహిళలు ప్రతి రంగంలో ముందంజలో ఉన్నారని అభినందించారు. అమ్మవారి నిమజ్జన కార్యక్రమం మంగళగిరి పురవీధుల్లో సంగీత బృందాల నడుమ శోభాయాత్రను మరింత వైభవంగా సాగింది. ఈ నిమజ్జనా కార్యక్రమంలో మాదాల కృష్ణ, భోగి నాగరాజు, కోగంటి లక్ష్మి, అడిగోపుల రత్నం, మధురై శీను (గురు స్వామి) షేక్ హసీనా, స్థానిక కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మహిళా భక్తులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.