వివిధ ట్రేడ్ లలో ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించిన 17 మంది విద్యార్థులు
ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా సత్కారం పొందిన ముగ్గురు విద్యార్థులు

జాతీయస్థాయి ఐటీఐ పరీక్షల్లో రాష్ట్ర విద్యార్థుల ప్రతిభ
వివిధ ట్రేడ్ లలో ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించిన 17 మంది విద్యార్థులు
ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా సత్కారం పొందిన ముగ్గురు విద్యార్థులు
జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన మంత్రి లోకేష్
అమరావతి ప్రతినిధి అక్టోబర్ 4 యువతరం న్యూస్:
విద్యార్థులను నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఐటీఐ కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానించడంతో పాటు వారికి అవసరమైన అత్యాధునిక సాంకేతిక, ఆచరణాత్మక శిక్షణను ప్రభుత్వం అందిస్తోంది. ఫలితంగా మన విద్యార్థులు జాతీయ స్థాయి ఐటీఐ పరీక్షల్లో రాణించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా లాభదాయకమైన ఉపాధి అవకాశాల కోసం పోటీపడేందుకు సదరు శిక్షణ ఎంతగానో దోహదపడుతోంది. కూటమి ప్రభుత్వ కృషి కారణంగా ఆల్ ఇండియా ఐటీఐ పరీక్షల్లో వివిధ ట్రేడ్ లకు సంబంధించి 17 మంది రాష్ట్ర విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ లు సాధించారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా టాపర్ సర్టిఫికెట్లు అందుకున్నారు. శనివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన ‘కౌశల దీక్షాత్ సమరోహ్’ వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పి.మధులత(ఆర్ అండ్ ఏసీ టెక్నీషియన్), డి.వందన(పెయింటర్ జనరల్), ఎస్.యామిని వరలక్ష్మి(వుడ్ వర్క్ టెక్నీషియన్) సత్కారం పొందారు. నైపుణ్య శిక్షణ పొందిన విద్యార్థులు.. ముఖ్యంగా ట్రేడ్ టెస్ట్ లలో ఉత్తీర్ణులైన విద్యార్థులను సన్మానించేందుకు ఏటా ‘కౌశల్ దీక్షాత్ సమరోహ్’ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆల్ ఇండియా ఐటీఐ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. దేశ,విదేశీ కంపెనీలతో కలిసి విద్యార్థుల్లో నైపుణ్యం పెంపునకు కృషిచేస్తామని చెప్పారు.