KURNOOL: కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి

జిల్లాలో ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి
కర్నూలు కలెక్టరేట్ అక్టోబర్ 03 యువతరం న్యూస్:
ఈ నెల 16 వ తేదీన ప్రధానమంత్రి జిల్లాలో పర్యటించనున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందిన నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం అయ్యేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ప్రధానమంత్రి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి ఇంకా అధికారికంగా షెడ్యూల్ విడుదల కాలేదన్నారు. అయితే ప్రాథమికంగా సమాచారం అందిందని, పర్యటన కు సంబంధించి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి జిల్లాకు రానున్నారని తెలిపారు. నగరంలో ప్రధానమంత్రి 4 వేల మందితో సమావేశం ఉంటుందని, రైతు బజార్ సర్కిల్ నుంచి నంద్యాల చెక్ పోస్ట్ వరకు రోడ్ షో నిర్వహిస్తున్నందున అందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నగరంలో సుందరీకరణ, పారిశుధ్యం, రోడ్ల మరమ్మతులు, అవసరం ఉన్న వీధి లైట్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ ను ఆదేశించారు. వీవీఐపీ ప్రయాణించే రూట్ లో బ్యారికేడింగ్, హెలిపాడ్ ల నిర్మాణంపై ఆర్ అండ్ బి ఎస్ ఈ తో చర్చించారు. మీటింగ్ ప్రాంతంలో లెవెలింగ్, ఎగ్జిట్, ఎంట్రీ తదితర ఏర్పాట్లు చేయాలని, మెడికల్ క్యాంప్, హై స్పీడ్ ఇంటర్నెట్ తదితర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కాన్వాయ్, ఫుడ్ అరేంజ్మెంట్స్, వీఐపీ లకు వసతి, కంట్రోల్ రూమ్ తదితర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ, స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, హౌసింగ్ పిడి చిరంజీవి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఆర్ అండ్ బి ఎస్ ఈ మహేశ్వర్ రెడ్డి, జడ్పీ సీఈవో నాసర రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.