రాష్ట్ర బెస్త కార్పొరేషన్ డైరెక్టర్‌గా కరిమద్దెల భాస్కర్ రావు నియామకం
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన నూతన డైరెక్టర్

రాష్ట్ర బెస్త కార్పొరేషన్ డైరెక్టర్‌గా కరిమద్దెల భాస్కర్ రావు నియామకం
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన నూతన డైరెక్టర్
కర్నూలు రూరల్ అక్టోబర్ 01 యువతరం న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెస్త కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన కరిమద్దెల భాస్కర్ రావు కూటమి ప్రభుత్వానికి బుధవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై నమ్మకంతో కల్పించిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని, ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా భాస్కర్ రావు… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెస్త కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్ వారికి, రాష్ట్ర ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే, జనసేన పార్టీ మత్స్యకార విభాగం చైర్మన్ బొమ్మిడి నాయకర్ కి ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. మత్స్యకార వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.