
మా గ్రామానికి రోడ్డు శాంక్షన్ చేయాలి
అంటున్న నిమ్మలపాలెం గ్రామస్తులు
జి మాడుగుల అక్టోబర్ 1
యువతరం న్యూస్:
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం ,కిటుముల పంచాయతీ , నిమ్మలపాలెం గ్రామంలో స్థానిక గ్రామస్తులు రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు
స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాల అవుతున్న మా గ్రామాలకి మాత్రం రోడ్డు సౌకర్యం లెదు గత సంవత్సరం నుంచి
రోడ్డు కోసం అధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం అయినా అధికారులు నుండి ఎటువంటి
స్పష్టత అయితే లేదు అని గ్రామస్తులు అన్నారు.
మూడు నెలల ముందు జూన్ నెల 12వ తేదీ న రోడ్డు సమస్య నిమిత్తము జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు వినతి పత్రం ఇచ్చి మా గ్రామ రోడ్డు సమస్య విషయమై తెలియజేయగా వెంటనే మండల స్థాయి డి ఈ, ఏఈ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి నిమ్మలపాలెం గ్రామంలో రోడ్డు సమస్య విషయమై కలెక్టర్ గారు ఎంక్వైర్ చేసి వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని ట్రైబల్ వెల్ఫేర్
రహదారి నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశాలు జరిచేగా ,డిఈ
ఏఈ,
వచ్చి కొలతలు అయితే తీసుకోవడం జరిగిందని గ్రామస్తులు అన్నారు . ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నామని. ఆగస్టు సెప్టెంబర్, నెలల్లో భారీ ఎత్తున వర్షాలు పడడంతో కాలినడకతో నడవడానికి కూడా చాలా కష్టగా ఉంది అని నిమ్మలపాలెం స్థానిక గ్రామస్తులు లక్ష్మణరావు అన్నారు. మా తాతలు, ముతాతలు దినాలు నుంచి రహదారి సౌకర్యం లేక బాధపడుతూ బ్రతికారు, ఇప్పుడు మేము మా పిల్లలు కుడా సరైన రోడ్డు సౌకర్యం లేక
చావు బ్రతుకుల మధ్య డోలి మోతలు మోస్తూ బ్రతుకు నెట్టుకుంటూ ఈ మారుమూల ప్రాంతంలో జీవిస్తూ ఉన్నామని
ఇప్పటికైనా అధికారులు మా బాధలు అర్థం చేసుకొని నిమ్మలపాలెం గ్రామానికి రోడ్డు శాంక్షన్ చేసి త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము అని స్థానిక గ్రామస్తులు స్త్రీలు పురుషులు
కోరారు. మా గ్రామానికి రోడ్ సౌకర్యం లేకపోవడంతో గర్భిణి స్త్రీలు డెలివరీ సమయం వచ్చినప్పుడు డోలుమోతులతో ఎత్తుకొని ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో అంబులెన్స్ ఉన్నచోట తీసుకెళ్లవలసిన పరిస్థితి వస్తుందని గతంలో అయితే డోలుమోతలతో తీసుకెళ్తుండగా ఒక పేషెంట్ హాస్పటల్ కి అందకుండానే మధ్యదారిలోనే ప్రాణాలు పోయాయని ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ అడవుల మధ్యా నా
వేరే ఆధారం లేక జీవిస్తూ ఉన్నామని గ్రామస్తులు అన్నారు. వెంటనే మా గ్రామానికి రోడ్డు శాంక్షన్ చేసి పనులు ప్రారంభించాలని గ్రామస్తులు కోరారు . ఇదిగో చేస్తేం అదిగో చేస్తాం అనే మాయ మాటలు చెప్పడం కాకుండా ఈ ప్రభుత్వం హయామంలోని
మా గ్రామానికి రహదారి నిర్మించి పనులు ప్రారంభించే అధికారులు కృషి చేయాలని స్థానిక గ్రామస్తులు కోరారు.