కర్నూలు జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు , సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు తెల్పిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఆయుధ పూజ

కర్నూలు జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు , సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు తెల్పిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ ఐపియస్
పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఆయుధ పూజ
దుర్గా దేవికి , పోలీసులు వినియోగించే అన్ని రకాల తుపాకులకు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా ఎస్పీ దంపతులు
కర్నూలు క్రైమ్ అక్టోబర్ 01 యువతరం న్యూస్:
జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు , సిబ్బందికి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్, ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ ఐపియస్ లు బుధవారం విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్బంగా ప్రతీ ఏటా ఆనవాయితీ గా చేపట్టే ఆయుధ పూజ ను జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ దంపతులు నిర్వహించారు. పోలీసు ఆయుధాగారంలో పోలీసులు వినియోగించే ప్రతీ ఆయుధాన్ని అలంకరించారు.
దుర్గాదేవి చిత్రపటానికి, జమ్మిచెట్టుకు, పోలీసు వాహనాలకు పూజలు చేశారు.
విజయాలకు చిహ్నమైన ఈ విజయదశమి అందరికి విజయం చేకూర్చాలని , సుఖ సంతోషాలతో ఆనందంగా దసరా పండుగను జరుపుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్, ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ లు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్ , కర్నూల్ డిఎస్పీ జె. బాబు ప్రసాద్, సిఐలు, ఆర్ ఐలు , ఆర్ ఎస్ ఐ లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.