ANDHRA PRADESHCRIME NEWSOFFICIAL
జొన్నగిరి గ్రామంలో వజ్రాల అన్వేషణ కొరకు వచ్చేవారు వెంటనే వెళ్ళిపోవాలి
జొన్నగిరి ఎస్సై మల్లికార్జున

జొన్నగిరి గ్రామంలో వజ్రాల అన్వేషణ కొరకు వచ్చేవారు వెంటనే వెళ్ళిపోవాలి
జొన్నగిరి ఎస్సై మల్లికార్జున
తుగ్గలి సెప్టెంబర్ 29 యువతరం న్యూస్:
తుగ్గలి మండలం పరిధిలోని జొన్నగిరి మరియు చుట్టుపక్కల గ్రామ రైతులు వారి పంట పొలాలు నాశనం అవుతున్నాయని వజ్రాల అన్వేషణ కొరకని వస్తూ పొలాల్లో సంచరిస్తూ పంటలు నాశనం అవుతున్నాయని,వజ్రాల అన్వేషణ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి అవకాశం ఉన్నందున
వజ్రాల అన్వేషణ కొరకు వచ్చేవారు కొంతమంది గ్రామాలలో తిరుగుతూ అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని, పై సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఉన్నత అధికారుల ఉత్తర్వులు మేరకు ముందు జాగ్రత్త నిమిత్తం వజ్రాల అన్వేషణకు ఎవరు రాకూడదని, వచ్చేటటువంటి వారికి ఎవరు కూడా ఆశ్రమం కల్పించరాదని హోటల్ యజమానులకు మరియు అదే విధంగా ఆటో డ్రైవర్లకు ఎస్సై మల్లికార్జున వారికీ సూచనలు చేశారు.