ANDHRA PRADESHBREAKING NEWSOFFICIALSTATE NEWS

వరద నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్

వరద నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్

రేపల్లె సెప్టెంబర్ 29 యువతరం న్యూస్:

ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రజలు జాగరూకతతో ఉండాలని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. రేపల్లె , వేమూరు నియోజకవర్గ కరకట్టకు అనుకుని ఉన్న లంక గ్రామాల ప్రజలను అధికారులు నిరంతరం అప్రమత్తం చేయాలన్నారు. కృష్ణానది కరకట్ట వెంబడి పరిస్థితిని అధికారులు ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని రెవిన్యూ అధికారులకు, పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. కరకట్ట ప్రాంతంలో గండి పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.
కృష్ణానది పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు నదిని గాని, కాలువలు గాని దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు. సోషల్ మీడియాలో జరిగే వదంతులను నమ్మవద్దన్నారు.
ఎటువంటి విపత్తునైనా ఎదుర్కునేందుకు రాష్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అనగాని తెలిపారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!