శ్రీ మహా చండీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్న శ్రీమాతా అంబా భవాని

శ్రీ మహా చండీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్న శ్రీమాతా అంబా భవాని
కోడుమూరు సెప్టెంబర్ 28 యువతరం న్యూస్:
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కోడుమూరులోని శ్రీమాతా అంబా భవాని ఏడవ రోజు శ్రీ మహా చండీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చింది. శ్రీ సోమవంశ సహస్రార్జున క్షత్రియ( కత్రి) సమాజ్ సంఘం ఆధ్వర్యంలో కోడుమూరు శ్రీ రాముల వారి దేవాలయం సన్నిధిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మరియు మహిళలు అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమార్చన చేశారు. అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం శ్రీ రాములవారి దేవాలయంలో కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినట్టు ఎస్ ఎస్ కే సమాజ్ అధ్యక్షులు మిస్కిన్ రాంప్రసాద్ మరియు ఉపాధ్యక్షులు జీతూరి రవికుమార్ యువజన అధ్యక్షులు పులిమామిడి రవికుమార్ మరియు నాగప్ప గణేష్ తదితరులు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.