స్వాతంత్ర్య విప్లవ జ్వాల భగత్ సింగ్

స్వాతంత్ర్య విప్లవ జ్వాల భగత్ సింగ్
ప్రతి యువకుడు భగత్ సింగ్‌ను స్ఫూర్తి తీసుకోవాలి
దేవనకొండ సెప్టెంబర్ 28 యువతరం న్యూస్:
షాహిద్ భగత్ సింగ్ స్ఫూర్తితో యువకులు దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని రిటైర్మెంట్ ప్రధానోపాధ్యాయులు ఉచ్చిరప్ప, మాజీ సైనికులు బూసుల రామాంజనేయులు పిలుపునిచ్చారు. ఆదివారం దేవనకొండ లో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో భగత్ సింగ్ 118 వ జయంతి వేడుకలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ మనుషులను చంపగలరేమో కానీ, వారి ఆశయాలను చంపలేరని ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదంతో స్వేచ్ఛాకాంక్షను రగిల్చి, స్వరాజ్య సాధన పోరాటంలో చిరు ప్రాయంలోనే ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యోధుడు. ఆయన పేరు వింటే చాలు యావత్ భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుందన్నారు. భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో నేటి యువత దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగులు నబి రసూల్, వెంకటేష్, అబ్దుల్, నాగరాజు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.