ANDHRA PRADESHPROBLEMS
తగ్గని పెద్దవాగు _తప్పని తిప్పలు

తగ్గని పెద్దవాగు తప్పని తిప్పలు
కొత్తపల్లి సెప్టెంబర్ 27 యువతరం న్యూస్:
మండల పరిధిలోని శివపురం నుంచి ఎం. లింగాపురం వెళ్లేదారిలో పెద్దవాగు ఉదృతి తగ్గకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ముసలిమడుగు, ఎర్రమరం గ్రామాల్లో వివాహాకార్యక్రమాలు ఉండటంతో వివాహాలకు వచ్చిన జనం ట్రాక్టర్ పై ప్రమాదకరంగా వాగు దాటారు ఏదైనా అత్యవసర ఆరోగ్య సమస్యలు వస్తే రాత్రి వేలలో వాగు దాటలేమని ఆ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.