ANDHRA PRADESHBREAKING NEWSCRIME NEWSOFFICIALPROBLEMS
వాగుదాటే ప్రయత్నం చేయొద్దు
రూరల్ సీఐ సురేష్ కుమార్ రెడ్డి

వాగుదాటే ప్రయత్నం చేయొద్దు
రూరల్ సీఐ సురేష్ కుమార్ రెడ్డి
కొత్తపల్లి సెప్టెంబరు 27 యువతరం న్యూస్:
వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున ఏవ్వరు కూడా వాగులు దాటే ప్రయత్నం చేయకూడదని ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన మండలంలోని ఎం. లింగాపురం శివపురం గ్రామాల మధ్య ఉన్న ఎద్దులేరు వాగు ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలకు ఎద్దులేరు వాగు ఉధృతి ఎక్కువగా ఉందని ఎవ్వరుకూడా బైకులపైగాని, ఆటోలలోగాని, నడుచుకుంటూగాని వాగులు దాటే ప్రయత్నం చేసి ప్రమాదాలను కొనితెచ్చుకోకూడదని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట ఎఎస్ఐ రామ్ నాయక్ కానిస్టేబుల్లు అశ్వక్, షేక్షావలి, తదితరులు ఉన్నారు.