సిఐటియు జిల్లా మహాసభలు ప్రారంభం
రేపల్లెపట్టణంలో కార్మిక ప్రదర్శన

సిఐటియు జిల్లా మహాసభలు ప్రారంభం
రేపల్లెపట్టణంలో కార్మిక ప్రదర్శన
రెపరెపలాడిన ఎర్రజెండాలు
రేపల్లె సెప్టెంబర్ 27 యువతరం న్యూస్:
రేపల్లె పట్టణంలో సీఐటీయూ జిల్లా రెండవ మహాసభలు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలో బస్టాండ్ వద్ద నుండి పట్టణంలో నెహ్రూ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎర్రజెండాలు చేతబట్టి, డప్పు కళాకారులతో, కోలాట దళాలుతో ఉత్సాభరితంగా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నెహ్రూ బొమ్మ వద్ద సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్.మణిలాల్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు.
సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కే. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులపై అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నిర్బంధాలను ప్రయోగిస్తున్నాయని పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేస్తూ కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయని ఎనిమిది గంటల పనిని 13 గంటలకు పెంచటం కార్మికులకు ద్రోహం చేయటమేనని విమర్శించారు. మేడే ద్వారా సాధించుకున్న ఎనిమిది గంటల పనికి త పొడవడం అని విమర్శించారు. చిరు ఉద్యోగులుగా ఉన్నటువంటి అంగన్వాడి, ఆశ తదితర రంగాల్లో కార్మికులకు కనీసవేతనాలు అమలు చేయడం లేదన్నారు. కేంద్రంలో మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు అమలుచేస్తున్నారని విమర్శించే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసవేతనాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత మాట దాటవేస్తున్నారని తక్షణం పెరిగిన ధరలకు అనుగుణంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును పునరుద్దిస్తామని, గతంలో హామీ ప్రకారం భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నుండి నిధులు ఇచ్చే ఆదుకోపోవటం మోసం చేయటమేనని అన్నారు. ఈరోజు కూటమి నేతలు సంక్షేమ పథకాలు గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. కార్మికులకు అమలు చేస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు అమలుచేయడం లేదన్నారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కే.ధనలక్ష్మి మాట్లాడుతూ* వేతనాలు పెంచకుండా అనేక ఆంక్షలు పెడుతూ సంక్షేమ పథకాలు తూట్లు పొడుస్తున్నారని కార్మికులందరికీ సంక్షేమ పథకాల అమలుచేయాలని కోరారు, రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలపై సిఐటియు నికరమైన పోరాటం నిర్వహిస్తుందని కార్మికవర్గాన్ని సమీకరించి భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేపడుతామని,ఈ ప్రభుత్వాలు కూడా కార్మికుల సమస్యల పరిష్కారం చేయకపోతే గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందని,ప్రభుత్వంగ సంస్థగా ఉన్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించటం మాటలు మార్చటం కార్మికులందరూ గమనిస్తున్నారని ఎన్నికల్లో హామీ ప్రకారం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరించకుండా ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు,కేంద్రంలో మోడీతో సాగిలపడినటువంటి రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష,అధికార పార్టీల నేతలు రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్రంలో కార్మికుల గురించి ఉపాధి గురించి, హోదా గురించి ప్రశ్నించటం లేదని తక్షణం రాష్ట్రహక్కుల కోసం కార్మికుల సంక్షేమంకోసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని అన్నారు. ఈ బహిరంగసభలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ మజుందార్, జిల్లా అధ్యక్షులు సీహెచ్.మణిలాల్,జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్.గంగయ్య అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పి.రేఖ ఎలిజబెత్, జిల్లా అధ్యక్షులు కె.ఝాన్సీ సిఐటీయూ జిల్లా నాయకులు జె.ధర్మరాజు, తిరుమల రెడ్డి, కె.వసంతరావు, కె. శరత్ తదితరులు పాల్గొన్నారు.