పరిశ్రమలు రాష్ట్రం విడిచి తరలిపోయేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది
శాసనమండలిలో సూపర్ సిక్స్ పథకాలపై చర్చలో మాట్లాడిన మంత్రి టి.జి. భరత్

పరిశ్రమలు రాష్ట్రం విడిచి తరలిపోయేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది
20 లక్షల ఉద్యోగాలంటే వైసీపీకి వాలంటీర్స్ జాబ్‌లే గుర్తొస్తాయి
శాసనమండలిలో సూపర్ సిక్స్ పథకాలపై చర్చలో మాట్లాడిన మంత్రి టి.జి. భరత్
అమరావతి ప్రతినిధి సెప్టెంబర్ 26 యువతరం న్యూస్:
20 లక్షల ఉద్యోగాలంటే వైసీపీ నేతలు వాలంటీర్ ఉద్యోగాలే అనుకుంటారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ చెప్పారు. శాసనమండలిలో సూపర్ సిక్స్ పథకాలపై జరిగిన షార్ట్ డిస్కషన్‌లో మంత్రి టి.జి భరత్ మాట్లాడారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతోనే తాము పనిచేస్తున్నామన్నారు. ఇటీవల నిర్వహించిన డీఎస్సీ ద్వారా 16 వేల మంది ఉద్యోగాలు పొందారన్నారు. సచివాలయం సమీపంలో నిర్వహించిన వేడుకకు డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు హాజరై ఎంతో సంతోషం వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. మాటిచ్చిన విధంగా తప్పకుండా 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతామని మంత్రి టి.జి భరత్ పేర్కొన్నారు. ఇప్పటికే పది లక్షల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన 13 లక్షల కోట్ల ఎంఓయూల్లో ఏవీ గ్రౌండ్ అవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్‌ను తరిమేశారని ఆయన వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. పేరుగాంచిన అమరరాజ కంపెనీకి ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు.