పట్టణ పరిశుభ్రతను కాపాడటంలో ప్రజలు బాగస్వాములు కావాలి
చెత్త తొలగించిన చోట ముగ్గులు వేస్తున్న మహిళలు

పట్టణ పరిశుభ్రతను కాపాడటంలో ప్రజలు బాగస్వాములు కావాలి
చెత్త తొలగించిన చోట ముగ్గులు వేస్తున్న మహిళలు
రేపల్లె సెప్టెంబర్ 26 యువతరం న్యూస్:
పట్టణ ప్రజలు చెత్తలను ఎక్కడబడితే అక్కడ వేయకుండా, ఇంటింటికి వచ్చి చెత్త సేకరించే మునిసిపల్ వర్కర్లకు ఇచ్చి పట్టణ పరిశుభ్రతను కాపాడటంలో ప్రజలు బాగస్వాములు కావాలని మునిసిపల్ కమీషనర్ కె. సాంబశివరావు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ” ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ శ్రమదానం ” కార్యక్రమంలో భాగంగా గురువారం వినాయకుడి గుడి ప్రాంతంలోని పోలీస్ క్వార్టర్స్ వద్ద ఉన్న చెత్త పాయింట్ ను మునిసిపల్ అధికారులు శుభ్రపరచి అక్కడి మహిళలతో ముగ్గులు వేయించారు. చెత్తను బయట పారవేయకుండా, మునిసిపల్ కార్మికులకు అందజేస్తామని స్థానిక ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ వారానికి ఒకరోజు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొని, స్వచ్ఛ రేపల్లెకు పాటుపడి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కమీషనర్ ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో శానిటరి ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, శానిటేషన్ సెక్రటరీలు, పట్టణ ఆదర్శ వేదిక కన్వీనర్ వై. కిషోర్ బాబు పాల్గొన్నారు.