ANDHRA PRADESHDEVOTIONALWORLD
శ్రీ రాఘవేంద్రస్వామి వారి మఠం పరిసర ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు

శ్రీ రాఘవేంద్రస్వామి వారి మఠం పరిసర ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు
మంత్రాలయం ప్రతినిధి సెప్టెంబర్ 26 యువతరం న్యూస్:
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు మాధవరం ఎస్ ఐ విజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది మరియు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ టీమ్ తో కలిసి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి గుడి పరిసర ప్రాంతాలలో, ప్రధాన కూడళ్లలో, జనం రద్దీగా ఉండే ప్రదేశాలలో మరియు తుంగభద్ర రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో అనుమానిత వ్యక్తులను మరియు అనుమానిత వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలను/భక్తులను అనుమానిత వ్యక్తుల పట్ల, అనుమానిత వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండి ఏదైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.