నేరాల నియంత్రణకు నిఘా పటిష్టం

నేరాల నియంత్రణకు నిఘా పటిష్టం
విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా
కర్నూలు క్రైమ్ సెప్టెంబర్ 24 యువతరం న్యూస్:
జిల్లాలో నేరాల నియంత్రణ కోసం విజిబుల్ పోలీసింగ్ చేయాలని నిఘా ను పటిష్టం చేయాలని జిల్లా పోలీసులకు కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ఆయా పోలీసుస్టేషన్ ల పరిధులలో ప్రజల భద్రత , రక్షణలో అన్ని ముఖ్య కూడళ్లు, జనం రద్దీగా ఉండే ప్రదేశాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ లు , రహదారుల పై సంచరిస్తూ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఎటువంటి నేరాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
ముఖ్యంగా నిషేధిత వస్తువులు, గంజాయి వంటి వాటి అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తల పై అవగాహన కల్పిస్తున్నారు.
తెలియని లింకులను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంచుకోవద్దని సూచిస్తున్నారు. ప్రజల భద్రతకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వెంటనే స్ధానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.