ఏపీఎస్పీసీఎల్ కు భూమి కేటాయింపుపై ప్రతిపాదనలు వెంటనే పంపండి
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

ఏపీఎస్పీసీఎల్ కు భూమి కేటాయింపుపై ప్రతిపాదనలు వెంటనే పంపండి
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల ప్రతినిధి సెప్టెంబర్ 24 యువతరం న్యూస్:
ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి లీజ్ ప్రాతిపదికన భూముల కేటాయింపుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆలస్యం చేయకుండా వెంటనే పంపించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా అధికారులకు సూచించారు. బుధవారం విజయవాడలోని సీసీఎల్ఏ కార్యాలయం నుంచి సీసీఎల్ఏ విజయలక్ష్మి ఆధ్వర్యంలో సంబంధిత జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో భూ కేటాయింపుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, డీఆర్ఓ రామునాయక్, కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ నరసింహారావు తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సోలార్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం గతంలో భూమి కేటాయింపు ప్రతిపాదనను సమర్పించడం జరిగిందన్నారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లాలోని గడివేముల మండలం, గని గ్రామ పరిధిలో లభ్యమయ్యే ప్రభుత్వ భూమిని పరిశీలించాం. సుమారు 604.99 ఎకరాల భూమిని లీజ్ బేసిస్‌పై కేటాయించేందుకు ప్రతిపాదన సిద్ధం చేసి, వెంటనే సీసీఎల్ఏ కార్యాలయానికి పంపాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే భూమి కేటాయింపులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా సర్వే నంబర్ల వారీగా హద్దులను స్పష్టంగా గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమణలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు.