ANDHRA PRADESHDEVELOPOFFICIAL

అభివృద్ధిలో బాపట్ల జిల్లా రాష్ట్ర స్థాయిలో టాప్ 3 లో ఉండాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్

అభివృద్ధిలో బాపట్ల జిల్లా రాష్ట్ర స్థాయిలో టాప్ 3 లో ఉండాలి

ప్రతి రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల లోపు జిల్లా కలెక్టర్ నుండి జిల్లా, మండల స్థాయి అధికారులకు ఫోన్ వస్తుంది

ఈ – ఆఫీసు ద్వారా నే అన్ని ఫైల్స్ కలెక్టర్ కు పంపించాలి

జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ ప్రభుత్వం కావాలి

జిల్లాలోఎక్కడ కూడా ప్రజలు ఇబ్బందులు పడకూడదు

జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్

రేపల్లె సెప్టెంబర్ 23 యువతరం న్యూస్:

రాష్ట్ర అభివృద్ధిలో బాపట్ల జిల్లా టాప్ 3 లో ఉండేలా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు.
సోమవారం ఉదయం రేపల్లె రెవిన్యూ డివిజన్ కార్యాలయం నందు ఆర్డీఓ. యన్.రామలక్ష్మి, డి ఎస్ పి.ఏ.శ్రీనివాస్ రావ్ తో కలసి నిర్వహించిన ప్రజా సమస్యల పరిస్కార వేదికలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో బాపట్ల జిల్లా టాప్ 3 లో ఉండేలా అధికారులు అందరు పనిచేయాలన్నారు.ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లోను, డివిజన్,మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిస్కార వేదిక నిర్వహించడం జరుగుతుందని, పి జి ఆర్ ఎస్ లో ప్రజలు అందజేసిన సమస్యల అర్జీల పై ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు జిల్లా అధికారులు, మండల అధికారులు సమస్యల అర్జీలపై తీసుకున్న చర్యలకు సంబంధించి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇంకా పై ప్రతి శాఖ జిల్లా అధికారులు, మరియు మండల స్థాయి అధికారులు అన్ని ఫైల్స్ ఈ- ఆఫీసు ద్వారానే జిల్లా కలెక్టర్ కు పంపించాలని ఆదేశించారు. ఈ నెల 26, 27 తేదీలలో జిల్లా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని, జిల్లా అధికారులు,మండల స్థాయి అధికారులు అందరు సమన్వయము చేసుకొని జిల్లాలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం ఉన్న గ్రామాల ను ముందుగానే గుర్తించి అక్కడ పరిస్థితులు పరిశీలించుకొని అధికారులు అందరు వరదలు ఎదుర్కొవడానికి సిద్దంగా ఉండాలన్నారు. అవసరమైన చోట్ల బోట్స్, గజ ఈతగాళ్లు, వైద్యసిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని. వరదల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పనిచేయాలని, ప్రతి రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. అధికారులకు ఏదైనా పని చెపితే 24 గంటల్లో పూర్తి చేయాలని, ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల లోపు అధికారులకు కలెక్టర్ ఫోన్ చేయడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలో పారిశుద్ధ్యంపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలని, అక్కడ అక్కడ ఎక్కువ కొబ్బరి బొండాల చిప్పలు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసి దిబ్బలు ఉన్నాయని వాటిని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేటట్లు పంచాయతీ సెక్రటరీ లు చూడాలని డి పి ఓ ను ఆదేశించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో స్వచ్చంద్ర,స్వర్ణాంధ్ర కార్యక్రమాలు బాగా నిర్వహించారో అ జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తుందని తెలిపారు. వర్షాల సమయంలో వివిధ రకాల జ్వరాలు రావడం జరుగుతుందని, దీని పై డి యం & హెచ్ ఓ,డి సిహెచ్ ఇద్దరు ప్రతి రోజు జిల్లాలో పర్యటించి మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది అందరు ఆసుపత్రిలో, పి హెచ్ సి, సి హెచ్ సి లలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది తో వాట్సాప్ గ్రూప్ చేయాలని అందులో జిల్లా కలెక్టర్ ను యాడ్ చేయాలన్నారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా వైద్య అధికారులు ముందస్తు ఏర్పాటు చేయాలని డి యం & హెచ్ ఓ ను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ జిల్లాలో పర్యటించినపుడు, జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఉన్నపుడు ప్రజలు కలెక్టర్ కు సమస్యల అర్జీలు ఇవ్వడం జరుగుతున్నదని నేను అర్జీని పూర్తి గా చదివి ఆ తర్వాత సంబంధిత శాఖకు పంపించడం జరుగుతుందన్నారు. అర్జీదారుని సమస్య పరిష్కరం అవుతుందా లేదా పరిస్కారం చేయలేని పరిస్థితిలో మీ సమస్యలను పరిష్కరించలేమని ఫోన్ ద్వారా లేదా లెటర్ ద్వారా అర్జీదారులకు సమాచారం తెలియజేయాలన్నారు.
అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుండి సమస్యల అర్జీలను స్వీకరించి అర్జీదారుల చెప్పే సమస్యలను సానుకూలంగా వింటూ అర్జీలను స్వీకరించి మీ సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని కలెక్టర్ అర్జీదారులకు చూచించారు.
అనంతరం రేపల్లె మండలం పెనుమూడి వారది వద్ద ప్రవహిస్తున్న నీటిని పరిశీలించారు, భట్టిప్రోలు మండలం, ఓలేరు పల్లెపాలెం, తూర్పుపాలెం ప్రాంతంలో ఉన్న కరకట్ట గతం సంవత్సరం లో వచ్చిన వరదలకు దెబ్బతిన్న కరకట్టకు మరమ్మతులు చేపట్టిన కరకట్ట గురించి ఇరిగేషన్ ఏ ఈ కలెక్టరకు వివరించారు. .ఇపుడు వస్తున్న వర్షాలకు మళ్ళీ కరకట్ట దెబ్బతినకుండా ముందు జాగ్రత్తగా ఏలాంటి చర్యలు తీసుకుంటారని ఇరిగేషన్ ఏ ఈని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైన ప్రమాదం జరుగుతుందని తెలిస్తే వెంటనే పనులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండి సంబంధిత అధికారులకు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా తెలియజేసిన పార్టీ సీనియర్ నాయకుడు అనగాని శివప్రసాద్ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలసి నియోజకవర్గంలో సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో అన్నిశాఖల మండల స్థాయి అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!