CRIME NEWSTELANGANA
జలపాతంలో సెల్ఫీ కోసం వెళ్లి…….

జలపాతంలో సెల్ఫీ కోసం వెళ్లి విగత జీవిగా మారిన యువకుడు
ములుగు ప్రతినిధి సెప్టెంబర్ 21 యువతరం న్యూస్:
ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగల జలపాతం లో యువకుడు గల్లంతు, వివరాల్లోకి వెళితే హైదరాబాద్ ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన 8 మంది యువకులు హైదరాబాదు నుండి కొంగాల జలపాతానికి చూడడానికి వచ్చిన యువకుడు బండరాయి పైకి ఎక్కి సెల్ఫీ తీస్తుండగా కాలు జారి జలపాతం లో పడి గల్లంతయ్యాడు, మిస్ అయిన మృతదేహాన్ని ఫారెస్ట్ అధికారులు ఫైర్ సిబ్బంది పోలీస్ శాఖ కలసి వెలికి తీయడం జరిగింది, యువకుని పేరు మహాశ్విన్ తండ్రి పవన్ సాయి గణేష్ అనే వ్యక్తి హైదరాబాద్ నుండి ఆదివారం సెలవు కావడంతో ఫ్రెండ్స్ తో కలిసి జలపాతం చూడడానికి వచ్చి విగత జీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మునీరు అవుతున్నారు.