ఎటువంటి తొక్కిసలాట లేకుండా ఉల్లి బస్తా (సుమారు 45 కిలోలు) 100 రూపాయలకు అమ్మేందుకు 4 కౌంటర్ లను ఏర్పాటు
కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

ఎటువంటి తొక్కిసలాట లేకుండా ఉల్లి బస్తా (సుమారు 45 కిలోలు) 100 రూపాయలకు అమ్మేందుకు 4 కౌంటర్ లను ఏర్పాటు చేశాం
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు కలెక్టరేట్ సెప్టెంబర్ 21 యువతరం న్యూస్:
ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ఉల్లి బస్తా (సుమారు 45 కిలోలు) 100 రూపాయలకు అమ్మేందుకు 4 కౌంటర్ లను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు.
ఆదివారం కర్నూలు మార్కెట్ యార్డ్ లో వంద రూపాయలకు ఉల్లి బస్తా (45 కిలోలు) విక్రయాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు మార్కెట్ యార్డ్ లో 1900 టన్నుల స్టాక్ ఉందన్నారు. వాటన్నిటిని కూడా కర్నూలు మార్కెట్ యార్డ్ లో ఉల్లి బస్తా (సుమారు 45 కిలోలు) 100 రూపాయలకు అమ్మేందుకు 4 కౌంటర్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 130 బస్తాలను అమ్మడం జరిగిందన్నారు. ప్రజల రద్దీని కంట్రోల్ చేసేందుకు పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శానిటేషన్ సరిగా లేనందున శానిటేషన్ చేయించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య,మార్కెట్ యార్డ్ సెక్రెటరీ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.