తనిఖీలు చేస్తా.. అలసత్వం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తా
సచివాలయ ఉద్యోగులకు కమిషనర్ పి.విశ్వనాథ్ హెచ్చరిక

తనిఖీలు చేస్తా.. అలసత్వం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తా
సచివాలయ ఉద్యోగులకు కమిషనర్ పి.విశ్వనాథ్ హెచ్చరిక
బయటకు వెళ్తే మూవ్మెంట్ రిజిస్టర్లో వివరాలు నమోదు చేయాల్సిందే
కర్నూలు మున్సిపాలిటీ సెప్టెంబర్ 20 యువతరం న్యూస్:
‘నగరంలోని సచివాలయాలను ఇకపై ఆకస్మిక తనిఖీలు చేస్తా, విధుల్లో అలసత్వం వహిస్తున్నట్లు కనబడితే కఠినంగా వ్యవహరిస్తా’నని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ సచివాలయ కార్యదర్శులను హెచ్చరించారు. శనివారం ఆయన సంకల్ బాగ్ 123, 124వ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 123 వ సచివాలయంలో ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో జాప్యంపై కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. కార్యదర్శులు బయటకు ఎక్కడికి వెళ్ళినా తప్పనిసరిగా మూవ్మెంట్ రిజిస్టర్లో వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలు అడిగినా సమాచారాన్ని స్పష్టంగా, సంయమనంతో ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజల నుండి ఫిర్యాదులు వస్తే, విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.