చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
రూ.127.87 కోట్లు చెల్లించి చేనేత సహకార సంఘాలను ఆదుకోవాలి

చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
రూ.127.87 కోట్లు చెల్లించి చేనేత సహకార సంఘాలను ఆదుకోవాలి
రేపల్లె సెప్టెంబర్ 19 యువతరం న్యూస్:
సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న చేనేత కార్మికులను ఆదుకోవడంలోను , సహకార సంఘాలను పరిరక్షించడంలో పాలక ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయని ఆంధ్ర ప్రదేశ్ చేనేత కార్మిక సంఘం మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు మండిపడ్డారు. చేనేత సహకార సంఘాలకు పాలకవర్గ ఎన్నికలు నిర్వహించాలి, సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించవలసిన రూ. 127.87 కోట్లు తక్షణమే చెల్లించి సంఘాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేత అధ్యయన యాత్ర కార్యక్రమంలో భాగంగా రేపల్లెలో గురువారం చేనేత కార్మిక సంఘం రాష్ట్ర బృందం చేనేత కార్మికులను కలుసుకుని వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ అధ్యయన యాత్రలో చేనేత కార్మికులు తమ సమస్యలను వెల్లువెత్తుతున్నారని అనేక సంవత్సరాలుగా పాలక ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలం కావడంతో నేతన్నలు నిత్యం అనేక సమస్యలను ఎదుర్కొంటూ బ్రతుకు భారంగా గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మగ్గం ఉన్న చేనేత కార్మికులకు మగ్గం ఉన్న చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందిస్తామంటూ ఎన్నికల్లో వాగ్దానం చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నప్పటికీ ఉచిత విద్యుత్ ఊసే లేకుండా పోయిందని ఆరోపించారు. మగ్గం వేసే ప్రతి చేనేత కార్మికుని తోపాటు ఉప వృత్తుల్లో పనిచేస్తున్న కార్మికులకు నేతన్న భరోసా పథకం ద్వారా సంవత్సరానికి 36 వేల రూపాయలు అందించాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ మాట్లాడుతూ చేనేతకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్ చట్టం అమలులో పాలక ప్రభుత్వాలు చూపుతున్న నిర్లక్ష్య వైఖరి చేనేత పరిశ్రమకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమానులు చేనేతకు కేటాయించిన వస్త్రాలను ఇస్తానుసారంగా తయారు చేస్తున్నప్పటికీ పాలకులు, అధికారులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చేనేత పరిశ్రమ రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టడంతో పాటు పవర్ మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. నాగాంజనేయులు, చేనేత కార్మిక సంఘం గుంటూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గజవల్లి వెంకటకృష్ణ, బత్తూరి మోహనరావు, రాష్ట్ర సమితి సభ్యులు కొడాలి రామకోటేశ్వరరావు, చేనేత కార్మికులు కే పార్థసారథి, కే వీర మోహన్ రావు, వి. శ్రీనివాసరావు, నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.