జీవీఎంసీలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

జీవీఎంసీలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
ఉత్తరాంధ్ర ప్రతినిధి
సెప్టెంబర్ 17
యువతరం న్యూస్:
వాస్తు శిల్పి విశ్వకర్మ జయంతి వేడుకలు జీవీఎంసీలో ఘనంగా నిర్వహించడం జరిగిందని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి పేర్కొన్నారు. బుధవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, వ్యయ పరిశీలకులు సి.వాసుదేవరెడ్డి లతో కలిసి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్లు ఇరువురు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవీఎంసీ లోని వాస్తుశిల్పి విశ్వకర్మ జయంతి వేడుకలను నిర్వహించామని తెలిపారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న విశ్వకర్మ పూజ హిందువులు ఘనంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. బ్రహ్మకుమారుడే విశ్వకర్మ అని, ఆయన ప్రపంచ సృష్టికర్తగా కీర్తింపబడ్డాడని పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకా నగరాన్ని, పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనంతో పాటు దేవతలకు అనేక అద్భుతమైన ఆయుధాలను తయారు చేశారని, ఆయనను దివ్య వడ్రంగి అని కూడా పిలుస్తారని అదనపు కమిషనర్లు పేర్కొన్నారు .
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఇతర అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.